Bharata Deshamlo Venukabadina Varalu Mandal Udyamamu

Editor · Books

Bharata Deshamlo Venukabadina Varalu Mandal Udyamamu book cover

Price: Rs. 108. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని వెనుకబడిన వర్గాలు ఇంకా ఎప్పుడు మేల్కొంటాయి? సామాజిక ప్రజాస్వామ్యం కోసం, అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన వ్యవస్థల నిర్మాణం కోసం ఎవరేం చేయాలి? మండల్ కమీషన్ పేర్కొన్నట్టు, 'సామాజిక వెనుకబాటు తనంపై పోరాటం అనేది ముందుగా ఓ.బి.సి.ల మెదళ్ళలో యుద్ధం మొదలవ్వాలన్నది' తక్షణ అవసరం... ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 1996 నుంచి రాష్ట్రం వచ్చేవరకు సామాజిక వర్గాలే కేంద్రంగా భాగం పంచుకున్నారు. భారతదేశస్థాయిలో ఓ.బీ.సీ పరిశోధన వీరి ఆధ్వర్యంలో జరుగుతుంది. తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్, ఎలక్షన్ అట్లాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, 'కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు', 'యాదవులు - చరిత్ర, సంస్కృతి, ఉద్యమం' అనే పుస్తకాలు రచించారు. ప్రస్తుతం తెలంగాణ సమాజ్వాది పార్టీ అధ్యక్షులుగా, సామాజిక, రాజకీయ ఉద్యమాలలో పాలుపంచుకొంటున్నారు.

Browse more Telugu books