Bharata Desa Prajakavi gaddar
సామిడి జగన్ రెడ్డి / SAMIDI JAGAN REDDY · Biographies & Auto Biographies

Price: Rs. 900. జగన్రెడ్డి గద్దర్ మీద రాసిన ఈ మహాగ్రంథాన్ని చదివాక ఈ గ్రంథ రచనలో జగన్ రూపొందించుకున్న పరిశోధన పరికరాలను నేను అంచనా వేయగలిగినాను. ఈ క్రమంలో ఆయన మీద కేవీఆర్ ప్రభావం ఎంతగా ఉండిందో మనకు అర్ధం అవుతుంది. ఈ గ్రంథాన్ని రాయడానికి జగన్రెడ్డి తనదైన పరిశోధనా పద్ధతిని ఎన్నుకున్నాడు. కొన్ని సందర్భాలలో సైద్ధాంతిక పరిశోధన పద్ధతిని, మరికొన్ని చోట్ల సమన్వయ పరిశోధన పద్ధతిని, ఇంకొన్ని చోట్ల తులనాత్మక పరిశోధన రచయిత సామిడి జగన్ రెడ్డి పద్ధతిని పాటించాడు. ఒక సైద్ధాంతిక భావానికి అనువుగా ఒక అంశాన్ని అన్వయించి దాని బహిర్ అంతర్ గుణాలను ఆవిష్కరించే పద్దతి పరిశోధనలో ప్రముఖంగా ఉంటుంది. ప్రామాణీకరించబడిన సూత్రాన్ని ఒక సందర్భానికో, వ్యక్తికో అన్వయించి నిర్ధారించే 'ఇండక్టివ్ మెథడ్'ను జగన్ ఆధారం చేసుకున్నాడు. ఒక వస్తుస్థితిని సాదృశ్యమైన వాటితో పోల్చి సమాన సూత్రాన్ని ఆవిష్కరించడం తులనాత్మక పరిశోధన. ఇక్కడ గద్దర్ జీవితాన్ని, ఆయన పాట కవిత్వాన్ని, ఆయన నెలకొల్పిన ప్రదర్శన రీతులను చరిత్రతో, సమాజ నిర్మితితో, రాజకీయార్థిక పరిణామాలతో, సాహిత్య కళా రంగాలతో అన్వయించి, పరిశీలించి విశ్లేషించాడు." "చరిత్రకారుడు వాస్తవాలను ఎన్నుకొని వాటి ఆధారంగా తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ పని ప్రారంభిస్తాడు. వెలికివస్తున్న వాస్తవాలు ఒక దానిని మరొకటి ప్రభావితం చేసుకుంటూ మార్పు చెందుతుంటాయి. గతం, వర్తమానం పరస్పర సంబంధాలలో సాగిన జగన్రెడ్డి. రచన మనలో కొత్త ఆలోచనలను పాచుకొల్పుతుంది. వాస్తవాలకు ప్రాణం, అర్థం కల్పించే చరిత్రకారుడి వలన కొత్త విషయాలను మనం తెలుసుకోగలుగుతాం. మనకాలపు యుగకర్త గద్దర్ చరిత్రను జగన్రెడ్డి ఎంతో శ్రమించి అనేక ఉటంకింపులతో సాధికారికమైన పరిశోధనా గ్రంథాన్ని సాహిత్య ప్రపంచం ముందుకు తెస్తున్నందుకు అభినందిస్తూ గద్దర్ చరిత్రలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను."