Bhangarubata

Editor · Politics

Bhangarubata book cover

Price: Rs. 225. ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తీర్చిదిద్దిన పుస్తకం ఇది. విజయ్ వ్యాసాలు సత్యాన్ని ప్రజలకు చేరవేయడమే కాకుండా, గిట్టనివాళ్ల విమర్శలకు చక్కని సమాధానాన్నిచ్చాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది 'ఇన్ సైడర్ నరేషన్'. ఇందులో సమాచారం ఉంది. దీనికొక సాధికారత ఉంది. ఎంచుకున్న అంశాలు, విధాన పరమైన విషయాలతో దీనికొక సమగ్రత వచ్చింది. ఈ సాహసోపేతమైన పనికి పూనుకున్న విజయ్ ఘటికుడు. ప్రొ. ఘంటా చక్రపాణి, అధ్యక్షులు, టీ.ఎస్.పీ.ఎస్.సీ. తెలంగాణ ఎలా దగాపడిందో, విధ్వంసమై శిథిలమైందో తెలుసు. తెలంగాణ ముందు చరిత్రను, తెలంగాణ తరువాత రూపు దిద్దుకుంటున్న బంగారు తెలంగాణ భవిష్యత్తును విజయ్ వారం వారం ఒక కాలమిస్ట్ చిత్రించారు. అల్లం నారాయణ, చైర్మన్, మీడియా అకాడమీ నిజం గడపదాటక ముందే అబద్దం దేశాన్ని చుట్టివస్తుందని సామెత. నిజాన్ని గడపదాటించే యజ్ఞంలో ప్రధాన పాత్ర పోషించిన రచయితల్లో విజయ్ ఒకరు. బంగారు తెలంగాణ సాధనకోసం సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగును అక్షర బద్ధం చేస్తాడు విజయకుమార్. కట్టా శేఖర్ రెడ్డి, ఎడిటర్, నమస్తే తెలంగాణ విజయ్ రాసిన వ్యాసాలు ఆషామాషీవి కావు. సీఎం నిర్ణయాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా ఉపయోగకరమో విశ్లేషించి రాశారు. ఈ పుస్తకం ఏ పోటీ పరీక్షకైనా రిఫరెన్స్, సోర్స్ మెటీరియల్గా పనికొస్తుంది. వనం జ్వాలా నరసింహారావు, సీపీఆర్వో టు సీఎం కేసీఆర్ పరిపాలన సమర్థతను, రాష్ట్ర పురోగతిని, లౌకికత్వాన్ని, శత్రువుల కుట్రలను ఒక్కో వ్యాసం ద్వారా సరళంగా సుబోధకంగా, అరటిపండు వొలిచి పెట్టినట్లుగా వివరించిన ఘటికుడు విజయ్. దేశపతి శ్రీనివాస్, ఓఎస్టీ టు సీఎం.

Browse more Telugu books