Bhalavyakaranamu

Editor · Cinima

Bhalavyakaranamu book cover

Price: Rs. 270. డా॥ ఆలేటి మోహన్రెడ్డి శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాల, పాలెంలోనూ, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల, హైదరాబాదు లోను డిప్.ఓ.ఎల్; బి.ఓ.ఎల్; ఎం.ఓ.ఎల్ అధ్యయనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి పట్టాలు పొందారు. హైదరాబాదు లోని రిఫా-యె-ఆం ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా, ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లోనూ, శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలోనూ ఉపన్యాసకులుగా పనిచేశారు. అసోసియేట్ ప్రొఫెసర్గా 2008 లో పదవీ విరమణ చేశారు. 'ప్రథమాంధ్ర కల్పిత కావ్యము ధనాభిరామము' వీరి ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం 'వనపర్తి సంస్థానము - తెలుగు సాహిత్య సేవ' ను ఓరియంట్ లాఙ్మన్ ప్రచురించింది. వీరి 'తెలుగు వ్యాకరణ దీపిక' కూడా ఓరియంట్ లాఙ్మన్ ప్రచురణే. వివిధ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు. వివిధ సంచికల్లో వ్యాసాలు ప్రచురించారు. వ్యాకరణ బోధనలో సుదీర్ఘానుభవం కలిగిన డా॥ మోహన్. రెడ్డి గారు విద్యార్థులకు ఉపయోగకరంగా, సరళంగా, వివిధ ప్రయోగాల రూపసాధన ప్రక్రియతో వివరంగా చిన్నయసూరి బాలవ్యాకరణానికి వ్యాఖ్యానం రచించారు. చిన్నయసూరి ఉదాహరించిన పదాలన్నిటికీ అర్థాల నిఘంటువును, అకారాది క్రమంలో సూత్రానుక్రమణికను కూడా కూర్చారు. విద్యార్థులకూ, ఉపాధ్యాయులకూ ఉపయోగపడే బాలవ్యాకరణ కరదీపికా వ్యాఖ్యానం ఇది.

Browse more Telugu books