Bhagavatha Kathalu

ఇందిరా సుబ్రహ్మణ్యం / Indira Subramanyam · Stories & Poetry

Bhagavatha Kathalu book cover

Price: Rs. 45. పాండురాజు పుత్రుడు... పాండవుల మధ్యముడు అయిన అర్జునుడి భార్య సుభద్రా గర్భాన జన్మించిన పుత్రుడు అభిమన్యుడు... అతడి భార్య ఉత్తర గర్భాన జన్మించిన పుత్రుడు పరీక్షితుడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు పరీక్షితుడిని పట్టాభిషిక్తుడ్ని చేసి మహాప్రస్థానానికి వెళ్ళిపోయారు. పరీక్షితుడు ధర్మబుద్ధితో... సత్యవ్రతం పాటిస్తూ ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలిస్తున్నాడు. అతడి పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తూ ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవించసాగారు. ఒకనాడు పరీక్షితుడు అడవికి వేటకువెళ్ళాడు. వేటలో అలసి పోయాడు... దాహం వేసింది. దగ్గరలోనే శమీక మహర్షి ఆశ్రమం కనిపించి అక్కడకు వెళ్ళాడు. ఆయన మహాతపశ్శాలి... పరీక్షితుడు వచ్చే సమయానికి ఆయన ధాన్యంలో ఉన్నాడు. పరీక్షితుడు “మహాత్మా... దాహం వేస్తున్నది నీరు ఇప్పించండి" అంటూ అడిగాడు.

Browse more Telugu books