BhagavadGita

Editor · History

BhagavadGita book cover

Price: Rs. 135. సాధారణ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎలా గెలవాలో తెలుపుతాయి. భగవద్గీత గెలుపును ఎలా ఆస్వాదించాలో మాత్రమే కాదు, ఓటమిని ఎలా తట్టుకోవాలో కూడా చెబుతుంది. గెలుపోటములను సమ దృష్టితో చూసే స్థిరబుద్ధిని ప్రసాదిస్తుంది. సాధారణ ఆధ్యాత్మిక గ్రంథాలు స్వర్గాన్నో నరకాన్నో చూపెడతాయి. స్వర్గానికీ నరకానికీ మించిన మనలోనే ఉన్న శాశ్వతమైన ఆత్మానందాన్ని ఎలా పొందాలో చెబుతుంది భగవద్గీత. భగవద్గీత కేవలం వ్యక్తి విజయాన్నే చెప్పదు. 'నా' నుండి 'మన' వరకు జరిగే ప్రయాణం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుపుతుంది. భగవద్గీత ప్రత్యేకంగా ఏ దేవుడినీ కొలవమని చెప్పదు. మానవుడే మాధవుడిగా ఎదిగే మార్గం చూపెడుతుంది. భగవద్గీత ముసలితనంలో చదవాల్సిన గ్రంథం కాదు. ఆలోచనల్లో ఎన్నడూ ముసలితనాన్ని రానివ్వకుండా చేసే గ్రంథం. ఇది చనిపోయిన తర్వాత వినే అరిగిపోయిన రికార్డ్ కాదు. మనిషి బతికి ఉన్నపుడే పొందాల్సిన తరిగిపోని సంపద. అలాంటి భగవద్గీతను అందరికీ అందుబాటులో ఉండేలా సరళమైన భాషలో అందించే ప్రయత్నం ఇది.

Browse more Telugu books