Bhagat Singh Oka Samagra Avagahana
Editor · History

Price: Rs. 162. భగత్సింగ్ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది ఆయన సాహస కృత్యాలు. ఆనాటి పార్లమెంటు సెంట్రల్ అసెంబ్లీలో ఒక చేతితో పిస్తోలు పట్టుకొని, మరొక చేతితో బాంబు విసిరేసిన ఘటనే స్ఫురిస్తుంది. కాని భగత్ సింగ్ వ్యక్తిత్వానికి సంబంధించి ఇది పాక్షికం మాత్రమే. ఆయన దార్శనికత, సామాజిక, రాజకీయ ఆలోచనలు అంతకు మించినవి. భగత్ సింగ్, ఆయన సహచరులు కేవలం బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి పారద్రోలడానికి మాత్రమే పోరాటం చేయలేదు. పెట్టుబడిదారీ, భూస్వామ్య, వలసవాద వ్యవస్థను అంతం చేసి, దాని స్థానంలో సోషలిస్టు సమాజ స్థాపన వైపుకు పురోగమించడం వారి లక్ష్యం. అందుచేత భగత్ సింగ్ సాహసాన్ని, అధ్యయనాన్ని, దార్శనికతను కలిపి అర్ధం చేసుకున్నపుడు మాత్రమే ఆయన సమగ్ర వ్యక్తిత్వం బోధపడుతుంది. అటువంటి అవగాహనను ప్రొఫెసర్ చమన్ లాల్ రచించిన ఈ పుస్తకం అందచేస్తుంది.