Beedhala Patlu

Editor · Best Selling

Beedhala Patlu book cover

Price: Rs. 540. విశాలమైన పరిదిని ఎంచుకుని విక్టర్ హ్యూగో రచించిన 'లే మిజరబిల్' ఎన్నో విశిష్ట పాత్రల ఆశ్చర్యకర సమ్మేళనంతో, హృదయ సంస్కారం పెంచే సన్నివేశ చిత్రణలతో అధ్యంతం ఆసక్తభరితంగా సాగిపోతుంది. అనేక ఉపకథలూ, ముఖ్యమైన అధ్యాయాలు ఎక్కడికక్కడ సహజమైన మలుపులతో కలసిపోతూ కధనం వేగంగా పరుగులు తీస్తుంది. ముఖ్యపాత్ర జీన్వాల్ జీన్ ఒక దొంగగా పరిచయమైన వాడు కాస్తా, జీవితదశలు గడుస్తున్న కొద్దీ అనేక అవతారాలు ఎత్తుతూంటాడు. ముఖ్యపాత్రను, కధను, వదిలిపెట్టి రచయిత వేరే విధంగా తీసుకొని పోతున్నాడని అపోహ పడతాం. కాని, కొత్త అధ్యాయంలో పరిచయం అయిన పాత్ర కొత్తది కాదు. ఆ పాత్రే ఇలా రూపాంతరం చెందిందా అని మనం విస్తుపోయేటప్పటికి విడ్డూరమైన సన్నివేశ చిత్రణ మనకు ఊపిరి సలపకుండా చేస్తుంది. మహాభారతం మాదిరి కథాపథక రచనను ఈ నవలలో ఆస్వాదించగలరని చెప్పడం అతిశయోక్తి కాదు. మానవ సహజమైన భావోద్రేకాలనూ, సంస్కార కుసంస్కారాలనూ సమర్థవంతంగా చిత్రించిన విక్టర్ హ్యూగో క్రితం శతాబ్దపు రచనను కాలాతీతంగా బ్రతికించి ఉంచారంటేనే 'లే మిజరబిల్' సత్తా ఏమిటో తెలుసుకోవచ్చును.

Browse more Telugu books