Batthula Beeshmarao Jeevitham-Udhyamam

Editor · Politics

Batthula Beeshmarao Jeevitham-Udhyamam book cover

Price: Rs. 90. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి ఇప్పటి వరకు కమ్యూనిస్టులు ప్రజల కోసం త్యాగాలు జేస్తూనే ఉన్నారు. ఈ త్యాగాల చరిత్రలో భద్రాచలం ప్రాంతంలో గిరిజన ప్రజల హక్కులను రక్షించడంలో, గిరిజన ప్రజలపై కొనసాగిన దోపిడీని ప్రతిఘటించడంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్పిస్టు) నాయకత్వాస నాయకులు, కార్యకర్తలు చేసిన అసమాన త్యాగాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, దాడులు మరిచిపోలేనివి. తృణప్రాయంగా ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప విప్లవకారుల్లో కామ్రేడ్ భీష్మారావు ఒకరు. గిరిజన ప్రజల కోసం ఆయన చేసిన కృషి, ఆఖరుకు ప్రాణత్యాగం చేసిన తీరు ఆదర్శనీయమైనది. ఈ పుస్తకం ద్వారా అటువంటి అమరవీరుడైన కామ్రేడ్ భీష్మారావును మరోసారి స్మరించుకుంటున్నాం. బి.వి. రాఘవులు, సిపిఐ (ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ భీష్మారావుగారి జీవితం గురించి, ఆయనతో తన సాహచర్యం గురించి, ఎదుర్కొన్న ఆటు పోట్లన్నంటినీ వివరిస్తూ వారి సతీమణి, రాష్ట్రపార్టీ నాయకురాలు, సోదరి హైమవతి ఈ పుస్తకం వ్రాయటం చాలా అభినందించదగిన విషయం. వారి జీవితం అందమైన అల్లిక కాదు. ఆటుపోట్ల నుండి ఆవిర్భవించిన ఉద్యమ ప్రస్థానం. ఈ రచన ఆమె భాషా పాండిత్యం నుండో, ఒక పుస్తకం తానూ రాయాలనే ఆకాంక్షనుండో వచ్చింది కాదు. తన గుండెలోతుల్లో దాగిన కఠోర వాస్తవాలూ, కఠిన పేదరికాన్ని ఎదుర్కొంటూ కూడా ఆశయ సాధన కోసం నిలబడి అందనంత ఎత్తుకు ఎదిగిన అమె వ్యక్తిత్వం నుండి, ప్రజా ఉద్యమాన్ని ఆవాహన చేసుకుని భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలనే ఆవేదనతో వెలువడిన అక్షరాలివి. తమ్మినేని వీరభద్రం , సిపిఐ (ఎం) కేంద్రకమిటీ సభ్యులు నక్సలైట్లు అనేకసార్లు హెచ్చరికలు చేసినా "ప్రాణాలు వదులుతాం కానీ పార్టీని వదలం" అన్నటువంటి ధీరులు వీరు. ప్రాణాలు వదులుతున్న సందర్భంలో కూడా కామ్రేడ్ భీష్మారావు గారు "కామ్రేడ్స్కు రెడ్ సెల్యూట్ చెబుతూ, మాకేం బాధలేదు, సుందరయ్య గారి దగ్గరకు వెళ్తున్నాం, ఎర్రజెండాను, పార్టీని కాపాడుకోవాలి" అని సూచిస్తూ అమరులైన గొప్ప నాయకులు. జాన్ వెస్లీ, సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈ సందర్భంగా భీష్మారావు, చందర

Browse more Telugu books