Bathukeetha
Endapalli Bharathi / ఎండపల్లి భారతి · Stories & Poetry

Price: Rs. 108. రాయలసీమ పల్లెల్లో శ్రామిక మహిళల ఎదారి బతుకులు గుండెకు హత్తుకునేట్టు చిత్రించిన ఎండపల్లి భారతిది కథా రచయితగా ప్రత్యేకమైన పరిశీలన, నుడికారం. స్వయం పోషక వ్యవస్థలుగా వుండిన పల్లెలు ఎట్లా క్రమంగా పరాధీనతలోకి కునారిల్లిపోతున్నాయో.. వలసలు ఎట్లా అనివార్యం అవుతున్నాయో ఈ బతుకీత కన్నులకు కడుతుంది. ఊరి తీయటి ఏటి నీరు తాగేందుకు కొరగాకుండా పోయి వాటర్ క్యాన్లు కొనుక్కునేందుకు జనం ఎలా ఎగబడుతున్నారో, తమకు తెలిసిన టమాటా లాంటి పంటలు వేసి నిండా మునిగిపోయి. చితికిపోయి తమకు తెలియని క్యాబేజి లాంటి పంటలవైపు ఎలా నెట్టి వేయబడుతున్నారో ఈ వెతల కథలు మనతో చెబుతాయి. ఇన్ని సమస్యల మధ్యనా ఒక చెదరని ఆశతో పల్లె మహిళలు ఎట్లా తమ జీవితాలను కలసిమెలిసి నిర్వహించుకుంటారో చూసినపుడు అదే ఆశ మన మనసులోనూ నాటుకుంటుంది. ఇది రచయితగా భారతి సాధించిన విజయం.