Bashai Tudu
ప్రభంజన్ / Prabhanjan · Novels

Price: Rs. 108. ఉన్నాడు - లేడు అనిపించే పరస్పర విరుద్ధ భావాలు రేపే ఓ ఉత్కంఠభరిత ఆదివాసీ రైతాంగ విప్లవ కథా నాయకుడిని ఆవిష్కరిస్తుంది 'బషాయి టుడు' నవలిక, ఎక్కడ భూమిలేని వ్యవసాయ కూలీలు దిక్కులేని దీనావస్థలకు గురయ్యారన్నా అక్కడ బషాయి టుడు ప్రత్యక్షమవుతాడు. తిరుగుబాటుకు దారితీసి పోరుబాటలో ముందుండి వాళ్లను నడిపిస్తాడు. మరణిస్తాడు; మళ్లీ బ్రతికి మలిఘట్టంలో ప్రత్యక్షమవుతాడు. అతని మృతదేహాన్ని ఆనవాలుపట్టటానికి ప్రతిసారీ ఓ అకుంఠిత కమ్యూనిస్టు జర్నలిస్టు వెళ్లివస్తూనే ఉంటాడు. కళ్లకు కట్టే వాస్తవికత, విప్లవ స్వప్నం, నడుస్తున్న చరిత్ర, కల్పనా చమత్కృతుల మేలుకలయికను. తనదైన విలక్షణశైలిలో ప్రముఖ సమకాలీన బెంగాలీ నవలాకారిణి, క్రియాశీల సంఘసేవిక మహాశ్వేతా దేవి ఈ నవలికలో సాధించారు. విస్తృత దోపిడీ వ్యవస్థతో సంఘర్షించే స్త్రీలు, ఆదివాసీలు, విప్లవకారుల గురించి తీవ్రవేశంతో, ప్రగాఢ చారిత్రక స్పృహతో వాళ్ళ జీవన సమరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభవం నుంచి మహాశ్వేతాదేవి అవిరళంగా తన రచనల్ని కొనసాగిస్తున్నారు.