Barrister Parvateesam
Editor · Novels

Price: Rs. 825. తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరియు మరపురాని హాస్య నవల “బారిష్టర్ పార్వతీశం". మొక్కపాటి నరసింహశాస్త్రి గారి ఈ నవల సమకాలీన వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు. స్వాతంత్ర్యోద్యమ ప్రభావం, దేశభక్తి మెండుగా కలిగిన ఈ నవల ఈనాటి తరానికి చాలా అవసరం. దేశకట్టుబాట్లు, సంప్రదాయాలపట్ల గౌరవం, క్రమశిక్షణ, యువతరానికి మార్గదర్శనం చేయడమే ఈ నవలలోని అంతర్లీన సారాంశం. మల్టీకలర్ ముద్రణతో పాఠకులను అలరించడానికి తీసుకొచ్చే ఈ నవలా ప్రకాశకులకు అభినందనలు.