Banna Guru Shatakam
డాక్టర్ మంథని శంకర్ / Dr. Manthani Shankar · Stories & Poetry

Price: Rs. 70. ప్రస్తుత శతకం శ్రీమంథని శంకర్ రచించినది. తన గురువు అయిన ఆచార్య బన్న అయిలయ్యకు భక్తితో సమర్పించబడినది. దీనిలో లోకరీతి విస్తారంగా వర్ణించబడినది. మనకు తల్లి తండ్రి విద్యా బోధన చేసిన వారు లేదా పోషించెడి వారిని మహాభారతం గురువులుగా పేర్కొన్నది. ఈ శతకంలో గురుతత్త్వము గురుభావన సమర్పణ ఇవన్నీ సంలీనమైయున్నాయి. - ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు అయిలయ్యగారు శంకర్ గురువు. ఈ గురువు చెప్పిన మాట తననెంతగా ప్రభావితం చేయకపోతే మాటను బంతితోట అనగలుగుతాడు. బంతిపూవు రంగు బంగారం. ఈ బంతి తెలంగాణ వల్లెల్లో తోటలుగా పెంచబడుతుంది. గురువుమాటను ఈ బంతి తోటతో పోలుస్తున్నాడు. ఈ పూవు సామాన్యమైంది. సామాన్యులకు కూడ అందగలిగేట్టు రాసిన ఈ శతకానికి ఈ మకుటం కుదిరింది. ఈ మకుట రచనలోనే బన్న గురువు పట్ల శంకర్ కున్న భక్తి గౌరవాలు ప్రస్ఫుటమవుతున్నాయి. - ఆచార్య అనుమాండ్ల భూమయ్య బన్న అయిలయ్యగారి శిష్యుడై వారి ప్రేమను పరిపూర్ణంగా పొందిన శంకర్ గురువుగారి పేరిట ఒక శతకాన్నే రాసి వారి షష్టిపూర్తికి కానుకగా సమర్పించడం అందరికీ వేడుక కూర్చే సందర్భం. అయిలయ్యగారి మాట శంకర్కు వేదవాక్కు అంతటి ఆరాధనాభావం. శంకర్కు తను గురువుగారి పట్ల "బన్నగురువు మాట బంతితోట" అంటూ తన దేశికవర్యుని సుభాషిత బోధవ్యాజంతో నీతి ముక్తావళిని మనకందిస్తున్నాడు. - ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు ఆచార్య బన్న అయిలయ్యగారు “శిష్యహృత్తాపహారి" యైన గురువు. శిష్యుల హృదయ వికాసం కలగడానికి అవసరమైన జ్ఞానాన్ని విద్యతో పాటు బోధించే తత్త్వం గల్గిన ఆచార్య బన్న అయిలయ్యగారి గురుత్వంపై గురితో శంకర్ రచించి గురుశిష్య సంబంధానికి స్థిరత్వం కల్పించే ప్రయత్నం చేసాడు. ఇది ఒక గురువుపై శిష్యునికున్న గొప్ప గౌరవానికి ప్రతీక, ఆధునిక సమాజానికి అవసరమైన గురువు తోడ్పాటును తెలియజేస్తున్న రచన. - గన్నమరాజు గిరిజామనోహరబాబు