Balala Bommala Panchatantra Kathalu - 2
కె. రవికుమార్ / K. Ravikumar · Stories & Poetry

Price: Rs. 45. విగ్రహం అంటే రాతితోనో మట్టితోనో చేసిన బొమ్మ అని మనకు తెలిసిన అర్థం. కానీ 'విగ్రహం' అంటే విరోధం అనే అర్థం ఉంది. ఇద్దరు బలమైన శత్రువుల మధ్య ఏర్పడే ద్వేషం శత్రుత్వంగా మారితే పారీద్దరి మధ్య విరోధం ఏర్పడింది అంటారు పెద్దలు. ఇద్దరి మధ్య శత్రుత్వం కల్పించడం మిత్రభేదం అవుతుందని ఇంతకు ముందు మిత్రభేదంలో మనం తెలుసుకున్నాం. కానీ పరిచయమే లేని ఇద్దరి మధ్య మూడో వ్యక్తి విరోధాన్ని కలిగిస్తే అది విగ్రహం అవుతుంది. మిత్రలాభం, మిత్రభేదం లాగే ఈ విగ్రహంలో కూడా ఒక ప్రధాన కథ ఉంది. ఆ కథలోనే చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయి. ఈ ప్రధాన కథలో ముందు కథలలోలా కాక మనల్ని పలకరించే పాత్రలన్నీ కూడా పక్షులే. హంసలు, రామచిలుకలు, బాతులు, కాకులు, కొంగలు, గ్రద్దలు ఒకదాని మీద ఒకటి తగవులాడుకుని మనకు వినోదం కలిగిస్తాయి. ఎత్తుకు పైయెత్తులు వేసే పక్షుల మంత్రాలు, యుద్ధతంత్రాలు పన్నే సైన్యాధిపతులు, వాడియైన ముక్కులతో యుద్ధం చేసే పక్షి భటులకు ఈ కథలో కొదవ ఉండదు. నీటిలో నివసించే పక్షులకు... భూమి మీద సంచరించే పక్షులకు మధ్య అ3 రణంగా విరోధం ఏర్పడి చివరికి ఆ రెండు పక్షుల జాతులు యుద్ధం చెయ్యటం ఈ ప్రధాన కథలో మనల్ని ఆకర్షించే విశేషం. ఇక ప్రధాన కథలోకి వెడదామా...?