Balaala Bommala Raamaayanamu
ఇందిరా సుబ్రహ్మణ్యం / Indira Subramanyam · Children's Books

Price: Rs. 45. వేదాధ్యాయ సంపన్నుడు... తపశ్శాలి.. మునీశ్వరులలో శ్రేష్టుడు అయినటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఒకానొకనాడు త్రిలోకసంచారి.. బ్రహ్మమానసపుత్రుడయిన నారదమహర్షి రాగా ఆయనకు అత్యంత భక్తి శ్రద్దలతో నమస్కరించి ఈ విధంగా అడిగాడు. “మహాత్మా... ఈ సమస్త భూమండలంలో ఉత్తమమైనటువంటి గుణములు కలవాడు... ఉత్తమ శక్తి సంపన్నుడు... సమస్త ధర్మములను ఆచరించువాడు.. ఎల్లప్పుడు సత్యవాక్యములను పాలించువాడు... పరోపకారమే పరమావధిగా తలచువాడు... సంకల్పమునందు స్ధిరత్వము, కార్యమందు నిగ్రహము కలవాడు... సకల శాస్త్రముల మూలములు ఎరిగినవాడు. సదాచారములను పాటించువాడు.. కోపమును జయించినవాడు.... శాంతమును ఆభరణముగా ధరించినవాడు.. ఏ కర్తవ్యమునయినా చిత్తశుద్ధితో నిర్వర్తించువాడు...