Badi Nerpina Paathalu
బాలసుబ్రహ్మణ్యం / Balasubrahmanyam · Education & Science

Price: Rs. 45. మన పాఠశాల పిల్లలకు విద్యాబోధన చేయటంలో ఉపాధ్యాయులు అనేక అనుభవాలను సంపాదించుకుంటారు. వివిధ సామాజిక పరిస్థితుల్లో విద్యాబోధనను ఓ సృజనాత్మక ప్రక్రియగా తీర్చిదిద్దడానికి ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితకాలాన్ని అంకితం చేస్తుంటారు. ఈ అనుభవాలు, విద్యాబోధనలో ఉపాధ్యాయులు చేసిన ప్రయోగాలు అందరికీ తెలియవలసిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయుల కోసం 'బడి నేర్పిన పాఠాలు' పోటీని 'ఆంధ్రజ్యోతి-ఎమెస్కో' నిర్వహించాయి. ఈ పోటీలో వేలాదిమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జనవిజ్ఞానవేదిక, ఆంధ్రప్రదేశ్ సహకరించింది. ఈ రాష్ట్రస్థాయి పోటీలో ఎంపికైన ఉపాధ్యాయుల అనుభవాల మాలిక ఈ పుస్తకం.