Babasaheb Dhamma Patha Prayanam ((Dr.Babasaheb Ambendkar: Rachanalu, Upanasyalu) Series4

Editor · Politics

Babasaheb Dhamma Patha Prayanam ((Dr.Babasaheb Ambendkar: Rachanalu, Upanasyalu) Series4 book cover

Price: Rs. 45. బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ 1950-56 తన జీవితంలోని చివరి ఆరు సంవత్సరాలు బౌద్ధధమ్మ వికాసం, విశ్లేషణ, విస్తరణ, మార్గనిర్దేశంలో గడిపినట్టు కనిపిస్తుంది. నేపాల్లోని ఖాట్మండులో జరిగిన ప్రపంచ బౌద్ధ మహాసమ్మేళనంలో బోధిసత్వునిగా ప్రకాశించాడు. ఆ సభలో తాను ప్రసంగించవలసిన అంశం "బుద్ధుడు అహింస” కాగా మహాపండితుడు రాహుల్ సాంస్కృత్యాయన్ కోరిక మేరకు ప్రొఫెసర్ డా॥ జి. పి. మాల్యాంకర్ అభ్యర్థనతో 20 నవంబర్, 1956 నాడు సుప్రసిద్ధ ఉపన్యాసమైన 'ద బుద్ధుడు లేక కార్ల్్మర్మ్స్' అంశంపై ఉపన్యసించారు. భారత రాజ్యాంగం 26 జనవరి 1950లో అమలు కావడం మొదలయ్యింది. అమలులో సంక్షేమ రాజ్యస్థాపన లక్ష్యాన్ని పొందుపరిచారు. అసమానతలతో కూడుకున్న సమాజ స్థానంలో సమతారాజ్య స్థాపన కొరకు రాజ్యాంగం తోడ్పటుతో సరిచేసే విధంగా రూపొందించి, తన చివరి కోరికయిన భారతదేశాన్ని బౌద్ధమయం చెయ్యాలన్న సంకల్పం వైపు బాబాసాహెబ్ అడుగులు వేశారు. 2 మే 1950న ఢిల్లీలో బుద్ధజయంతిలో పాల్గొని ప్రసంగించడం, ఆనాడే కొంతమంది అనుయాయులతో కలిసి బౌద్ధాన్ని స్వీకరించిన విషయాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటున్నాము. 24 మే 1950న హైదరాబాద్ నుండి మద్రాస్ మీదుగా 25 మే శ్రీలంకలో జరుగుతున్న మొదటి ప్రపంచ బౌద్ధ మహాసభకు బాబాసాహెబ్ హాజరయ్యారు. 3 డిసెంబర్ 1954 నాడు రంగూన్లో రెండవ ప్రపంచ బౌద్ధ మహాసభలో బాబాసాహెబ్ పాల్గొన్నారు. ఈ సభలకు బాబాసాహెబ్ ఆహ్వానం మేరకు ద్రావిడ ఉద్యమ పితామహుడు పెరియార్ ఇ.వి. రామస్వామి కూడా హాజరయ్యారు. బాబాసాహెబ్ చివరి ఆరు సంవత్సరాలు బౌద్ధుల చారిత్రక ప్రదేశాలన్ని సందర్శించడమే కాకుండ చివరి సందేశాన్ని బాబాసాహెబ్ మనకు అందించడమే కాక ప్రపంచబౌద్ధ ఉద్యమానికి దిశానిర్ధేశం చేసిన మహానాయకుడు, మానవతామూర్తి బాబాసాహెబ్ డా|| అంబేడ్కర్.

Browse more Telugu books