Baba Saheb Ambendkar
Editor · Politics

Price: Rs. 180. డాక్టర్ విజయభారతి తమ పుస్తకంలో డాక్టర్ అంబేడ్కర్ దళిత జనోద్ధరణ కోసం చేసిన కృషిని, పోరాటాలను చక్కని శైలిలో వివరించారు. అంబేడ్కర్ జీవితమే కాకుండా అప్పటి సాంఘిక, రాజకీయ స్థితిగతుల్ని బాగా అధ్యయనం చేసి రచన సాగించారు. ఈ పుస్తకం ప్రస్తుత మూఢ విశ్వాసాలతో నిండివున్న సమాజంపై, కులతత్వం, మతతత్వం, అనైక్యతలపై 'డైనమైట్' వంటిది. సాంఘిక విప్లవానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. డాక్టర్ ఎం. ఏబెల్ (మాజీ వైస్ ఛాన్స్లర్, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం) ఈ గ్రంథ రచన చేసి తెలుగులో జీవిత చరిత్రలు రచించిన గొప్ప రచయితల జాబితాలో డాక్టర్ విజయభారతి స్థానం సంపాదించుకున్నారు. - డాక్టర్ దివాకర్ల వేంకటావధాని డాక్టర్ విజయభారతిగారి ఈ పుస్తకం టైమ్బంబ్ లాంటిది. కులతత్వంతో కూడిన సమాజ వ్యవస్థను ఇది బ్రద్దలు చేస్తుంది. ఈ పుస్తకం వల్ల కొందరి హృదయాలు బాధపడ్డా, మరికొందరి హృదయాలు సంస్కరింపబడతాయి. - జస్టిస్ కె. పున్నయ్య