BAABUJI

వేలూరి కృష్ణమూర్తి / VELOORI KRISHNAMOORTHY · Novels

BAABUJI book cover

Price: Rs. 135. శ్రీ రామచంద్ర మిషన్ స్థాపన జరిగినది 1945 లో. ఈ సంస్థ స్థాపనకు ఆద్యులు షాజహాన్ పూర్ శ్రీ రామచంద్ర (బాబూజి), తన ఆధ్యాత్మిక గురువు, సద్గురు ఫతేఘడ్ గురు మహరాజ్ శ్రీ రామచంద్రవారి పేరుతో గురు దక్షిణగా ఈ సంస్థ స్థాపనకు మూల కారకులు. ఈ మహత్తర కార్యంలో బాబూజికి చేదోడు వాదోడుగా వున్నవారు ఈశ్వర్ సహాయ్, పండిట్ రామేశ్వర్, శ్రీమతి కస్తూరి ముఖ్యులు, యోగ సాధనలో శ్రీ ఫతెఘడ్ శ్రీ రామచంద్రజి తన యోగ సాధన మార్గాన్ని 'సహజ మార్గ' అని నామకరణం చేసి 'ప్రాణహుతి', అన్న ఒక నూతన యోగ సాధన విధానాన్ని కనుగొని అమలుకు తెచ్చినవారు. 1945లో శ్రీ రామచంద్ర మిషన్ స్థాపన జరిగినా, ఈ సంస్థతో నాకు పరిచయమైంది 1990లో ననుకొంటా - 45 ఏళ్ళ అనంతరం, నా 45 ఏళ్ళ వయసులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, మైసూరు ముఖ్య శాఖకు చీఫ్ మ్యానేజర్ వున్న నాకు, నా ఉద్యోగ ధర్మంగా మైసూరు నుండి బెంగళూరుకు బదిలీ అయినపుడు, బ్యాంక్ బెంగళూరు ముఖ్య శాఖలో, ఒక ప్రముఖ విభాగానికి నేను చీఫ్ మానేజర్ గా వున్న సమయం. శ్రీ రామచంద్ర మిషన్, బెంగళూరు శాఖవారి అకౌంట్ మా బ్రాంచ్లో వుండేది. ఆ అకౌంటు విరాళాలు చెక్కులు, డ్రాఫ్టుల రూపంలో చాలా వస్తుండేవి - విదేశాలనుండి కూడ, ఆ సందర్భంలో ఈ సంస్థకు సంబంధించిన మా బ్యాంక్ సహోద్యోగులనుండి ఈ సంస్థ గురించి వివరాలు తెలుసుకొన్నా. మా బ్యాంకు ఉద్యోగులు, సీనియర్ ఆఫీసర్లు చాలామంది ఈ సంస్థలో అభ్యాసీలుగా యోగ శిక్షణ చేస్తున్నారని తెలిసింది. అలా, నేనుకూడ ఒక అభ్యాసీగా సంస్థలో చేరడం జరిగి ప్రతి వారం జరిగే సామూహిక ప్రార్థనా సభలలో పాల్గొనేవాడిని.

Browse more Telugu books