B for Ballot: 1989-2019 / బి ఫర్ బ్యాలెట్: 1989-2019

Satish Chandar / సతీష్ చందర్ · Politics

B for Ballot: 1989-2019 / బి ఫర్ బ్యాలెట్: 1989-2019 book cover

Price: Rs. 621. సతీష్ చందర్ ప్రసిద్ధ పత్రికా సంపాదకులు, కవి, వ్యంగ్య రచయిత, కథకులు, విమర్శకులు, మీడియా బోధకులు, టీవీ హెూస్ట్, 'వార్త' దినపత్రిక సహ వ్యవస్థాపక సంపాదకునిగానూ, 'ఆంధ్రప్రభ' దినపత్రిక ప్రధాన సంపాదకునిగానూ పనిచేశారు. ఎ.పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం (1997), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ (2014)ను స్థాపించి విజయవంతంగా నడిపి-స్తున్నారు. ఇంతవరకూ 20 గ్రంథాలు వెలువ-దించారు. ఇది 21వ పుస్తకం. సంపాదకునిగా ఆయన 30 యేళ్ళ యాత్ర భిన్నమైనది. పత్రికలు ఆయన్ని వెతుక్కుంటూ వస్తే, ఆయన స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్తారు. అందుకే విశ్లేషణలు నిష్పాక్షికంగా వుంటాయి. రాజకీయాల విశ్వరూపం ఎలక్షన్ల సమయంలో కనిపిస్తుంది. మూడు దశాబ్దాల (1989-2019) ఎన్నికల రాజకీయాలను, వివిధ విభాగాల (ప్రచారం, పొత్తులు, వోటు బ్యాంకులు, సమస్యలు, మధ్యంతరాలు, ఫిరాయింపులు, ఫలితాలు) కింద చర్చించి, వాటికి అనుబంధంగా ఎప్పటికప్పుడు ఆ రాజకీయాలను ఎక్స్రే తీసి బయిట పెట్టిన 196 సంపాదకీయాలను జోడించి, అందిస్తున్న గ్రంథమే 'బి ఫర్ బ్యాలట్', ఇంతవరకూ తెలుగులో ఇలాంటి పుస్తకం మరొకటి లేదు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికీ, సివిల్ సర్వీసెస్ ఔత్సాహికులకు, గ్రూప్-1 తత్సమాన పోటీ పరీక్షలకు తయారయ్యేవారికీ, పాత్రికేయులకూ, జర్నలిజం విద్యార్థులకూ, రాజకీయ విశ్లేషకులకూ, పరిశోధక విద్యార్థులకూ, ఇది అనునిత్యమూ ఉపయుక్తమయ్యే ప్రామాణిక గ్రంథం.

Browse more Telugu books