Azadee
Editor · Politics

Price: Rs. 160. ఆజాదీ! దిక్కులు పిక్కటిల్లే నినాదం. "స్వేచ్ఛ"కు, స్వాతంత్ర్యానికి ఉర్దూ పదం ఆజాదీ. కశ్మీరీల భావనలోని భారత ఆక్రమణకు వ్యతిరేకంగా కశ్మీర్ ప్రజల స్వాతంత్య్ర సమరానికి ఊపిర్లూదిన నివారం ఆజాదీ! ఆశ్చర్యకరంగా, హిందూ జాతీయ వాద పథక రచనకు వ్యతిరేకంగా భారత సమాజంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ లక్షలాది మంది పౌరుల నినాదం కూడా అదే ! స్వేచ్ఛ కోసం ఈ రెండు విభిన్న సమూహాల నుండి వినిపిస్తున్న వివాదాల మధ్య ఉన్నది ఏది? అగాధమా లేక వారధియా అని అరుంధతి రాయ్ ప్రశ్నించడం ప్రారంభిస్తుండగానే వీధులన్నీ మూగవోయాయి. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోనే ఆ పరిస్థితి. స్వేచ్ఛ అన్న పదానికి కోవిడ్-19 మరో భయంకరమయిన కొత్త అర్ధాన్ని తీసుకు వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దులంటే పిచ్చి ప్రేలాపన అనేట్టుగా, జనాభా మొత్తాన్ని నిర్బంధం చేసి, ఆధునిక ప్రపంచాన్ని ఇదివరకెన్నడూ జరగని విధంగా స్తంభింప చేసింది. అవధులు దాటి ప్రబలుతున్న నియంతృత్వపు ధోరణుల వాతావరణంలో స్వేచ్ఛకు ఉండే అర్ధాన్ని గురించి మరొక కోణంలో కూడా ఆలోచించండని వెన్నులో వణుకు పుట్టించే ఈ వ్యాసాల పరంపరలో అరుంధతి రాయ్ మనకొక సవాలు విసురుతున్నారు. ఈ వ్యాసాలలో సామూహిక, వ్యక్తిగత భాష గురించి ఆలోచనలున్నాయి. ప్రస్తుత సంక్షుభిత సమయాలలో కాల్పనిక రచనలు, ప్రత్యామ్నాయ ఊహల పాత్ర గురించి ఈ వ్యాసాలు చర్చిస్తాయి. పాండెమిక్ ఒక ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి మధ్య మరి అని అరుంధతీ రాయ్ అంటారు. పాండెమిక్ వల్ల సంభవించిన ఆనారోగ్యానికి, విద్యలసానికీ అంతటికీ, అది మానవ జాతికి ఒక కొత్త అవకాశం గురించి, ఒక కొత్త ప్రపంచం గురించి ఊహించమనే ఆహ్వానం పంపుతున్నదంటారు.