Avatali Gudise
Editor · Literature

Price: Rs. 100. జయ ప్రకాష్ కర్దమ్ ఉత్తరప్రదేశ్లోని గాజియాబాదు జిల్లా ఇందర్డి గ్రామం (హాపుర్రోడ్) లో 05 జులై, 1958న జన్మించారు. తత్వశాస్త్రం, చరిత్ర మరియు హిందీలలో ఎం.ఎ. పట్టాలు పొందారు. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నారు. మూడు నవలలు, రెండు కథల సంపుటాలు, నాలుగు కవితా సంకలనాలు, ఒక ఖండకావ్యం, పదమూడు విమర్శనా గ్రంథాలు మొత్తం నలభై పుస్తకాల వరకు ప్రచురించారు. 1999 నుంచి 'దళిత సాహిత్యం' వార్షిక పత్రికకు సంపాదకత్వం వహిస్తున్నారు. దేశవిదేశాలలోని విద్యాసంస్థలలో వీరి రచనలను పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారు. కర్దమ్ రచనల మీద అనేకమంది పరిశోధనలు చేసి డాక్టరేట్ డిగ్రీలు కూడ పొందారు. కొన్ని రచనలు భారతీయ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ అవార్డు, రామమనోహర్ లోహియా అవార్డుల్లాంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. భారత ప్రభుత్వ అధీనంలోని హిందీ శిక్షణ సంస్థలోడైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ప్రొఫెసర్ వి. కృష్ణ హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ గా, హిందీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. దళిత బహుజన ఆదివాసి సాహిత్యంపై విశేష కృషి జరిపారు. ప్రజా సైన్సు ఉద్యమంలో అనేక సంవత్సరాలు కీలకంగా పని చేశారు. బెల్జియం మరియు బల్గేరియాలో చైర్ ప్రొఫెసర్ గా సేవలందించారు. అనేక అంతర్జాతీయ సదస్సులలో వివిధ అంశాలపై పత్ర సమర్పణ చేశారు. నారాయణురు సాహిత్యరత్న, అంబేడ్కర్ విశిష్ట సేవాపురస్కారంల్లాంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. సెంటర్ ఫర్ దళిత స్టడీస్, సెంటర్ ఫర్ దళి దళిత ఆర్ట్ అండ్ లిటరేచర్ లాం లాంటి సంస్థలలో వ్యస్థాపక సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేకంగా దళిత, ఆదివాసీ సాహిత్యం మీద పరిశోధనల కోసం హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో సెంటర్ ఫర్ దళిత అండ్ ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్ లేషన్ ను స్థాపించారు.