Avaranam O Samajika, Arthika Avalokanam

Editor · Best Selling

Avaranam O Samajika, Arthika Avalokanam book cover

Price: Rs. 75. ప్రపంచ చారిత్రక గమనంలో ఏర్పడిన ఆర్థిక, సామాజిక, పర్యావరణ సంక్షోభ పరిష్కారంపై ఒక స్థూల తాత్విక దృక్కోణం ఏర్పడడానికి ఈ పుస్తకంలోని వ్యాసాలు దోహదం చేస్తాయి. వ్యవసాయం, పరిశ్రమలు, మాంసం ఉత్పత్తి తదితర రంగాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు; హరిత గృహ వాయువుల వెలువరింపులు; మానవ వినిమయంలో పోగుపడుతున్న వ్యర్థాల రూపంలోని కాలుష్యం వల్ల పెరుగుతున్న భూతాపం, పర్యవసానంగా ఏర్పడిన ప్రాణాంతక వాతావరణ మార్పులు- వీటి గురించి ఈ వ్యాసాలు చర్చిస్తాయి. స్వైన్ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ, టీబీ తదితర వ్యాధుల విజృంభణా, వాటి మందుల, టీకాల వ్యాపారంలో కార్పొరేట్ ఫార్మా కంపెనీల నిర్వాకం; జన్యు విత్తనాల, ఎరువుల, పురుగుమందుల వ్యాపారంలో కార్పొరేట్ కుట్రలు; వ్యవసాయ సంక్షోభంతో ముడిపడిన రైతుల ఆత్మహత్యలు; సంక్షోభంలో పడిన ప్రజారోగ్యం వంటి సామాజిక, పర్యావరణ విపత్తులపై శాస్త్రీయ విశ్లేషణ ఈ పుస్తకంలో ఉంది. భౌతికవాద పర్యావరణవాద దృక్పథంతో ప్రపంచ గతిని మార్చేందుకు కృషి చేయవలసిన తక్షణావసరాన్ని అర్ధం చేయించడంలో చిరు ప్రయత్నమే ఈ పుస్తకం. ఈ పుస్తకం వెన్నెలకంటి రామారావు సామాజిక కార్యాచరణలో ఏర్పరచుకున్న భౌతికవాద పర్యావరణవాద కృషి ఫలితం. ప్రపంచం (ప్రకృతి+సమాజం)లో ఏం జరుగుతోంది. అందులోని విభిన్న ప్రక్రియల మధ్య పరస్పర చర్యా-ప్రతిచర్యల పర్యవసానం ఏ దిశగా ఉంది అనే అంశాలపై రచయిత చేసిన తాత్విక వ్యాఖ్యలే ఈ వ్యాస సంకలనం.

Browse more Telugu books