Asta vankarala nava bharatham

Editor · Best Selling

Asta vankarala nava bharatham book cover

Price: Rs. 260. నేటి భారత గణతంత్ర వ్యవస్థ స్థితిపైన, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2014 నుండి అనుసరిస్తున్న విధానాల పైన పదునైన, ఆలోచనాత్మక వ్యాసాలు ఇవి 'అధికారపీఠానికి సమీపంలో ఉన్న వారు అధికారంలో ఉన్న వారికి నిజాన్ని చెప్పేందుకు భయపడుతున్న సమయంలో ఇది వర్తమాన పరిస్థితిపై వ్యాఖ్యానం. ఎన్నికైన రాజకీయవేత్తలు ప్రభుత్వం లోని అన్ని స్థాయిల్లోను డంబాలు పలికే నియంతలుగా మారారు. అధికారంలో ఉన్నవారు స్త్రీలైనా, పురుషులైనా విమర్శను సహించలేని నేటి పరిస్థితిలో ప్రభాకర్ వారికి నిజాన్ని చెబుతూనే ఉన్నాడు. మన రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువల పరిరక్షణ పట్ల ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం. ...భారత దేశపు వర్తమానం పట్ల, భవిష్యత్తు పట్ల ఆందోళన చెందే ప్రతి ఒక్కరు భారత దేశంలోను. ప్రపంచంలోను తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. -సంజయ్ బారు 'భారత దేశపు ప్రస్తుత పరిస్థితి మీద ఆసక్తికరమైన, కళ్ళుతెరిపించే అద్భుత వ్యాసాలు ఇవి.... పరకాల ప్రభాకర్ అంకెలు, వాస్తవాలతో స్పష్టతతో, నిబద్ధతతో, సాహసంతో మోడీ ప్రభుత్వ వాగ్దానాలు, వాస్తవ పనితీరు గురించి మరో కోణాన్ని ఆవిష్కరిస్తున్న వ్యాసాలు ఇవి. ఈ పుస్తకం ప్రజలకు ఓ మేలుకొలుపు. - శ్యామ్ పిట్రోడా టెలికాం సృష్టికర్త, పారిశ్రామికవేత్త, రచయిత

Browse more Telugu books