Asprushya Yodhudu
డా ॥ కాలువ మల్లయ్య / Dr. Kaaluva Mallaiah · Novels

Price: Rs. 270. దళిత బహుజన సామాజికోపయోగకరమైన సీరియస్ రచనలను మా ట్రస్ట్ ద్వారా ప్రచురిస్తున్నాం. సవర్ణుల అధికారం బహుజనుల అధికారం కాదు. సవర్ణుల చరిత్ర బహుజనుల చరిత్రకాదు. రాజ్యాధికారం లేని జాతి నశిస్తుంది అనే అంబేద్కర్ వాక్యాలను దృష్టిలో పెట్టుకొని మూలజాతుల రాజ్యాధికారం ధ్యేయంగా వేల పేజీల రచనలు చేసిన, చేస్తున్న డా ॥ కాలువ మల్లయ్య కలం నుండి వెలువడిన ఆణిముత్యం 'అస్పృశ్య యోధుడు' నవలను మా ట్రస్ట్ తరఫున ప్రచురించడం సగర్వంగా భావిస్తున్నాం. ఇంతకు ముందు ఈ రచయిత రాసిన మాదిగ విజయం, మెతుకుపుస్తకం నవలలను మా ట్రస్ట్ ద్వారా ప్రచురించాం. దళిత జీవన మూల్యాలు, సంవేదనలు ఎరిగిన దళిత జనబంధు కాలువ మల్లయ్య. -బి.వి.వి. చారిటబుల్ ట్రస్ట్ డా|| కాలువ మల్లయ్య దళిత రచనలు:- 1) మాదిగ విజయం (నవల), (2) అస్పృశ్య కోయిల (నవల) (3) మంచి అన్నది మాల అయితే (నవల), (4) మెతుకు పుస్తకం (నవల), (5) అస్పృశ్య యోధుడు (నవల), (6) నీ బాంచెన్ గులాపోన్ని (నవల) ముద్రణలో... (7) ఊరి చివరి గుడిసె నుండి నగరం నడిబొడ్డు వరకు (ఓ మాదిగ విజయ గాధ), (8) మీ రాజ్య మేరేలండి (మాదిగ దండోరా వ్యాసాలు), (9) కులరహిత భారతం, (10) అంబేద్కర్ సాక్షిగా (కథల సంపుటి) ముద్రణలో... (11) చెప్పు- డప్పు (కథల సంపుటి) ముద్రణలో... (12) అనేక వ్యాసాలు, కథలు పత్రికల్లో వచ్చినవి పుస్తకాలుగా రానున్నాయి. (13) పాకీవనం (నవల) త్వరలో.. (14) మాదిగ విజయం-2 త్వరలో...