Ashokavanam

Dr. Suddala Ashok Teja / డా॥ సుద్దాల అశోక్‌తేజ · Stories & Poetry

Ashokavanam book cover

Price: Rs. 540. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతివనరుల వినాశనం గురించి, అడవి బిడ్డల హక్కుల నిరాకరణ గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచనలు, చర్చలు జరుగుతున్న కాలం ఇది. అరణ్యవనరులను రక్షించుకోడానికి, అడవి మృగజాతులు అంతరించకుండా ఉండడానికి కొందరైనా కృషి చేస్తున్న రోజులివి. విహారయాత్రల్లో సైతం అరణ్యాలపట్ల జనం ఆకర్షితులవుతున్న సమయమిది. ఇలాంటి నేపథ్యంలో అడవినే ప్రధాన పాత్రధారిని చేసి, పౌరాణిక గాథల నుంచి పూలన్ దేవి వరకు ఎన్నో సంఘటనలను, వ్యక్తులను స్మరిస్తూ రాసిన కవితాసంకలనమిది. అరణ్యాన్ని ఆరాధించడం వేరు. మన జీవితంలో దాని పాత్రను విశ్లేషించడం వేరు. ప్రకృతిలోని మంచిచెడ్డలు రెండిటినీ తనలో ఇముడ్చుకున్న అడవి మనకు ఒకసారి భయం కలిగిస్తుంది. అయినా ఆ సౌందర్యం మనల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. అక్కడి ప్రజల జీవితం మనల్ని విస్మయపరుస్తూనే ఉంటుంది. మనం అడవిని చూసినా, మానినా, అడవి మాత్రం నిరంతరం మనల్ని చూస్తూనే ఉంటుంది. గమనిస్తూనే ఉంటుంది. ఈ భావనను ఒక కావ్యంగా మలిస్తే ఎలా ఉంటుంది? రామాయణానికి మాత్రమే ఇంతవరకూ పరిమితమైన. 'అశోకవనం' ఇప్పుడు మనందరిదీ అవుతుంది.

Browse more Telugu books