Ashani Sanketham
కాత్యాయని / Katyayani · Novels

Price: Rs. 135. " సినిమా కథలకు సంబంధించి ఒక బంగారు గని వంటి రచనలను అందించాడు. బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్, ఆయన సాహిత్యంపై మొదటినుండి ఆసక్తి ఏర్పడటం నా అదృష్టం" సత్యజిత్ రే సినిమా రూపంలో చూస్తున్నప్పుడే కాదు, అక్షరాలలో చదువుతున్నప్పుడు కూడా గాఢమైన అనుభూతినిచ్చే దృశ్యావరణం లోనికి పాఠకులను ప్రవేశపెడతాడు బిభూతిభూషణ్. 1943 నాటి బెంగాల్ కరువును దృశ్యమానం చేసిన నవల "అశని సంకేతం." అనాటి మానవ విషాదాన్ని గొప్ప ఆర్తితో చిత్రించిన ఈ రచన "కరువు"లోని వివిధ పార్శ్వాలనూ, దాన్ని సృష్టించిన శక్తుల స్వరూపాలనూ కళ్ళకు కడుతుంది.