Asadhula Peddamma Katha

Dr. Chigicherla Krishna Reddy / డాక్టర్ చిగిచెర్ల కృష్ణారెడ్డి · Literature

Asadhula Peddamma Katha book cover

Price: Rs. 180. జానపద విజ్ఞానంలో కథాగేయాలకు ప్రముఖ స్థానముంది. కథాగానాలలో పిచ్చికుంట్ల కథ, తంబూర కథ, తందానకథ, ఒగ్గుకథ, కొమ్ముకథ, జమిడికకథ, జముకులకథ, పటంకథ, మందెచ్చులకథ వంటి పేర్లతో రెండు తెలుగు రాష్ట్రాలలో గానం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లాలో 'ఆసాదికథ' అనే కథాగానం ప్రసిద్ధంగా ప్రచారంలో ఉంది. పెద్దమ్మ స్వామి కథను ఒక రోజు, మూడు, అయిదు, ఏడు, తొమ్మిది రోజులు గానం చేస్తారు. వీరు ముగ్గురుంటారు. అందరి దగ్గర జమడిక (జవికిని) అనే తీగ వాద్యముంటుంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగ మరుసటిరోజు తప్పనిసరిగా పెద్దమ్మ గుడి దగ్గర కథాగాన ప్రదర్శన ఉంటుంది. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలినప్పుడు, అమ్మవారు (తట్టు) సోకినప్పుడు గ్రామం మధ్యలో ఏడుకోర్ల పెద్దమ్మ కథను గానం చేయిస్తారు. మా ఇంటి దేవత పెద్దమ్మ స్వామి. మా తండ్రిగారి పేరు పెద్దిరెడ్డి. అలాగే పెన్న అహోబిలం ఓబలేసుస్వామి మా ఇంటిల్ల దేవునిగా చెబుతారు. మా తల్లిగారి పేరు ఓబుళమ్మ. మా స్వగ్రామంలో ఆసాది నాగన్న బృందం దగ్గర ఈ కథను సేకరించాను. కథను వినిపించిన బృందానికి కృతజ్ఞతలు. ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి తమ అమూల్య అభిప్రాయాన్ని ముందుమాట (For-ward) ద్వారా తెలియజేసిన ఆచార్య వై. ఎ. సుధాకరరెడ్డిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Browse more Telugu books