Arundhathi Charithra

Editor · History

Arundhathi Charithra book cover

Price: Rs. 180. ఒక కులం గురించి తెలుసుకొనే ముందు ఆ కులం యొక్క నివసించే గడ్డ వాటి పుట్టుక పరిణామాల గురించి పరిశీలించడం అవసరం. ఇవి ఒక దానికొకటి అవినాభావ సంబంధం కల్గిఉన్నాయి. గత చరిత్రను విస్మరించిన జాతికి గాని కులానికి గాని భవిష్యత్ లేదు. మన పూర్వీకులు ఎలా జీవించారో వారి చరిత్ర సంస్కృతి వారి వారసులుగా మనం తెలుసుకోవాలి. ఒక ప్రాచీన జాతి కారణాంతరముల వలన హీన స్థితికిలోనై, కీర్తి ప్రఖ్యాతులు లేకుండా పడి యున్నప్పుడు అట్టి వారిలో ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, అభ్యుదయ కాంక్ష పెంపాదించడానికి ఆ జాతి చరిత్రను పరిశీలించడం, పఠించడం, ప్రచారం చేయడం సంజీవి వంటిదని పండితులున్నారు. అయితే ఒక విషయం మరచిపోకూడదు. ఇప్పటి వరకు సాగిన చరిత్ర నడక ఏ రూపంలో సాగిందనేది కూడా మనం పరిశీలించాలి. అప్పుడే ఆ చరిత్ర భావి తరాలకు వెలుగు బాటగా వుంటుంది. చరిత్ర జరిగిందే జరుగుతుందనిగాని, ఎట్టి ఆటంకం లేకుండా ముందుకు సాగిపోతుందని కాని అనుకోరాదు. చరిత్ర గతికి అటుపోట్లున్నాయి. కార్ చెప్పినట్లు "ప్రగతి యున్నట్లే ప్రగతి నిరోధక యుగాలున్నాయి. ఒక తరం వారు సంపాదించిన కౌశల్యాన్ని నేర్పరి తనాన్ని ముందు తరానికందివ్వడం వల్ల వచ్చే ప్రగతే చరిత్ర” భారతజాతికి సంబంధించినంత వరకూ చరిత్ర రెండు భాగాలు. ఒకటి వాస్తవంగా తెలిసిన చరిత్ర. రెండవది ప్రాచీన సాహిత్యం ద్వారా తెలుస్తున్న చరిత్ర. రెండొవదానినే మనం ఇతిహాసం అంటున్నాం. భారతీయ జీవిత విధానాలపై ఇతిహాస ప్రభావం. అధికం. రష్యా ఆనార్కిస్టు ఉద్యమనాయకుడు, విప్లవస్వాప్నికుడు బకునీన్ అన్నమాటల్లో ఒక్క సత్యం ఉంది. "గతానికి చెందిన ఆట, పాట, మాట, సంగీతం అనాటి సమాజస్థితి, వర్తమానానికి బాట అవుతుంది. ఈ వాస్తవాన్ని గమనించని వాళ్ళు ఒక గొప్ప వారసత్వాన్ని కాలదన్ని గాలిలో నిలబడి పోరాడుతారు" అందుచేతనే బకునిన్ సూత్రీకరణ, ఇతిహాస ప్రమాణిక గ్రంథాలు, పరిశుద్ధలేఖనం బైబిల్ గ్రంధం, ఆధారం చేసికొని వాటిలోని అనేక అంశాలను పొందపరచి 'అరుంధతీ చరిత్ర (మాదిగ పుట్టు పూర్వోత్తరాలు)' గ్రంథంగా వ్రాసాను. మూలవాసులైనా మాదిగలు గురించి వ్రాయలంటే నా జ్ఞానం సరి

Browse more Telugu books