Aruna

Editor · Novels

Aruna book cover

Price: Rs. 100. “తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. +++ “ఆమె ప్రవేశం, నిష్క్రమణ మరోలోకానికి చెందినవా అనిపిస్తాయి. ఈ నవలను ప్రతీకాత్మకంగా అర్థం చేసుకోవాలి. సౌందర్యాకర్షక శక్తికి శృంగార చైతన్యానికి ప్రతీక “అరుణ”, భర్త కుటుంబ వ్యవస్థకు ప్రతినిధి. ప్రియులు ముగ్గురు మనిషిలోని భిన్న అంతరువులకు చిహ్నాలు. స్త్రీకి పరమ స్వేచ్ఛ లభించినపుడే ఆమెలోని శృంగార చైతన్యం సంపూర్ణంగా వికసిస్తుంది. అప్పుడే పురుషుడు స్త్రీ నుండి సంపూర్ణానందాన్ని చవిచూడ గలడు. కాని అట్టి పూర్ణస్త్రీని భరించగల పూర్ణపురుషుడు లేడు. చివరకు హృదయవాది పరమ ప్రియుడు అయిన రచయిత గూడ. కనుక ఆ సంపూర్ణ స్త్రీత్వం లోకానికి అందకుండానే పోతుంది. ఇది ఈ నవల అంతటా వినిపించే ధ్వని.”

Browse more Telugu books