Arepally Mattibiddalu

Nagabelli Jitendar Samrat / నాగబెల్లి జితేందర్ సామ్రాట్ · Literature

Arepally Mattibiddalu book cover

Price: Rs. 449. ఈ మట్టి బిడ్డలు చదవడం వలన అరెపల్లి పరిణామ క్రమం వ్యక్తుల జీవితాలు వారిలో వచ్చిన మార్పులు, ఆర్థిక విధానాలు, వ్యాపారస్థులపై పడే వాటి ప్రభావం, రాజకీయల పరిస్థితి, విప్లవోద్యమాల గమనం, మత విశ్వాసాలు, నమ్మకాలు, కొత్త ఆవిష్కరణలు, విద్యావ్యవస్థ, కుటుంబం కోసం యజమానులు చేసే త్యాగం, స్త్రీలు స్వయం కృషితో ఎదగడం, ఎన్నో అంశాలు మనకు ఈ కథనాల్లో కనిపిస్తాయి. దీనిని చదివిన తర్వాత తెలిసో తెలియకో మనం సమాజ నిర్మాణంలో భాగం అవుతున్నామనే స్పృహను ఈ రచన కలిగిస్తుంది. జితేందర్ సామ్రాట్ శైలి సరళమైనది. పాఠకుడిని తన వెంట లాక్కెల్లే స్వభావం ఈయన శైలికి ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా చరిత్రకెక్కించడం ఒక బాధ్యతగా జితేందర్ గారు స్వీకరించారు. ఈ మట్టి బిడ్డలు ఎందరికో స్ఫూర్తి కలిగిస్తుంది. - ఆచార్య బన్న అయిలయ్య, ఈ సంపుటిలో ఆరెపల్లి గ్రామంలో జరిగిన అనేక సంఘటనల్ని వివరిస్తూ జితేందర్ మొత్తం ఇరవై ఆరు ఉదంతాలను చిత్రించాడు. ఈ అన్ని కథల్లోనూ గ్రామీణ జీవితపు చిత్రణ, అక్కడి ప్రజల జీవన విధానం, పొరుగువాడికి తోడ్పడాలనే పల్లెప్రజల మనస్తత్వం మొదలైనవన్నీ ఈ కథల్లో చక్కగా వ్యక్తమయ్యాయి. ఇన్ని మంచి కథల్ని రచించిన జితేందరన్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. - అంపశయ్య నవీన్ ఆరెపల్లిని మొత్తంగా నైజాం కాలం నుంచి ఇప్పటిదాకా విహంగ వీక్షణం చేయిస్తాయి మనల్ని. ఈ వూరిలో మనకు కొట్టొచ్చినట్టు కనిపించే రెండు గొప్ప లక్షణాలు. ఒకటి, ఒకరిమీద ఒకరు, ఒక వర్గం మీద ఇంకొకరు దాడులు, హింసకు పాలుపడకపోవడం, కూర్చోని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవడం. రెండు: మద్యపానం లేకుండా, అక్షరాస్యతా, ఆర్య సమాజ్ ప్రభావం. ఈ యదార్థ కథలను చదివినంక ఇందులోని సజీవ పాత్రలను చూడాలని, వారితో ముచ్చట్లాడాలని మనకు తప్పక ముచ్చటేస్తది. సగటు మనిషి కోరుకునేది ఇటువంటి పరిస్థితులనే గదా! - జె.ఎన్. ఇది ఫక్తు ప్రజల చరిత్ర. ముఖ్యంగా మట్టి మనుషుల, గ్రామ శ్రమజీవుల బతుకు చరిత్ర. ఊరితో, కుటుంబాలతో ముడిపడిన బతుకుల కన్నీటి చరిత్ర. ఆరాటాలు, ఆశయాలు లేని స్వీయ వ్యక్తిగత మానవోత్తముల చరిత్ర. మోసంలే

Browse more Telugu books