Arella Prema
Editor · Best Selling

Price: Rs. 155. ఫిల్టర్ లేకుండా రాయడమే రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం అని నా అభిప్రాయం. ఇది ఈ నవలలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మనందరి మొదటి ప్రేమల్ని సున్నితంగా తాకుతుందీ పుస్తకం. ప్రేమించడం ప్రేమించబడడం ఎంత అద్భుతంగా ఉంటాయో, ప్రేమ తరువాత జీవితం ఎలా ఉంటుందో కొత్త కోణంలో చెప్పారు రచయిత్రి. ప్రేమలో ఉన్నప్పుడు ఉండే స్నేహాన్ని, అనుభవాలని, అనుభూతులు, బాధలు, భయాలు, ఎడబాటు, విరహం ఇలా అన్ని స్మృతులనూ కలిపి ఒక కొత్త అత్తరుని తయారు చేసి పుస్తకంలా మనకందించింది రచయిత్రి. చదివినంతసేపు ఆ అత్తరు సువాసన మిమల్ని మీ మొదటి ప్రేమ దగ్గరకి తీసుకుపోయి, ఆ అనుభవాల్లో మరొక్కసారి జీవించేలా చేస్తుంది. మనసుల మధ్య జరిగే రొమాన్స్ నుంచీ ఎడబాటులో తీసుకునే నిర్ణయాల వరకూ అన్నీ పరిణితితో రాసారు కీర్తి ఇనుగుర్తి. ఈ ప్రేమకథ మీది... నాది... మనందరిది... - కడిమి శ్రీదివ్య ప్రేమ ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమించబడడంలో అమాయకత్వం ఎంత ఉండాలో, ఆ ప్రేమ అందకుండా పోతున్నప్పుడు అంతే మెచ్యూరిటీ ఉండాలి. ఈ రెండూ ఆయా సమయాల్లో లేనపుడే జీవితాలు గతి తప్పుతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు... ఎప్పుడో ఎవరో మనకు గుర్తుగా ఇచ్చిన ఓ చిన్న నెమలీకో, ఇంకెవరి గుర్తుగానో దాచుకున్న జ్ఞాపకమో మనసుని తడుతుంది. మనిషిని కోల్పోయిన బాధ మెలితిప్పుతుంది. ప్రేమంటే ఇవ్వటమే కాదు, దూరాన్ని అంగీకరించటం, జీవితాన్ని ప్రేమించడం అనే విషయాన్ని కీర్తి ఇనుగుర్తి ఇంత సులభంగా చెప్పిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తతరం ఏమైపోతుందా అనిపించినప్పుడు, వాళ్లకి ఇచ్చే బహుమతుల్లో ఈ పుస్తకం కూడా ఉండాలి. పిల్లలకి జీవితాన్ని ప్రేమించడం కూడా తెలియాలంటే... ఈ కథ చదవాలి. -నరేష్కుమార్ సూఫీ