Ardhasastra Vimarsha

Editor · Economics & Agriculture

Ardhasastra Vimarsha book cover

Price: Rs. 210. అర్థశాస్త్ర విమర్శ అనువాదకులు :ఎ. గాంధి మార్కు పారిన్ లో ఉండగా అర్థశాస్త్ర అధ్యయనాన్ని 1844లో ప్రారంభించాడు. ఆయన ఆ పని తన జీవితపర్యంతం కొనసాగించాడు. బూర్జువా అర్థశాస్త్రాన్ని ఆసాంతం విమర్శనాయుతంగా విశ్లేషించాలనే లక్ష్యంలో భాగంగా ఆయన అర్థశాస్త్ర విమర్శ (Contribution to the Critique of Political Economy) అన్న పేరుతో మొదటి పుస్తకాన్ని విడుదల చేశాడు. అది 1859లో, అంటే ఆయన అధ్యయనం ప్రారంభించిన 15 ఏళ్లకు అన్నమాట. ఈ పుస్తకానికి ముందు ఆయన ఇంకేమీ ఆర్థిక రచనలు చేయలేదని కాదు. అయితే, మార్పు అర్థశాస్త్ర సమగ్ర వివేచనకి పూనుకొన్నది మాత్రం, ఈ గ్రంథంతోనే, మొదట ఇదే పేరుతో వరుసగా పుస్తకాలు విడుదల చెయ్యాలన్నది ఆయన ఆలోచన. అయితే, తర్వాత ఆ ఆలోచన మారింది. అర్థశాస్త్ర విమర్శ గ్రంధాన్ని అలా వదిలేసి పెట్టుబడి అన్న పేరుతో వరుసగా ఆరు గ్రంథాల్లో (నాలుగు సంపుటాల్లో) తన పని పూర్తి చేశాడు. మొదటి సంపుటి 1867లో వెలువడింది. ఆయన జీవిత కాలంలో ప్రచురణకి నోచుకొన్నది అదొక్కటే. అర్థశాస్త్ర విమర్శలో వివరించిన అనేక అంశాలు పెట్టుబడి మొదటి సంపుటిలో పునరావృత్తం అయ్యాయి. అయినప్పటికీ పెట్టుబడి గ్రంథంతో ప్రమేయం లేకుండానే అర్థశాస్త్ర విమర్శకి తనదంటూ ఒక స్వతంత్ర విలువ ఉందని మార్పు ఏంగెల్సుల అభిప్రాయం. ఇప్పుడు, అర్ధశాస్త్ర విమర్శ తొలిసారి తెలుగులో మీ ముందుంది.

Browse more Telugu books