Apoorva Vyasaalu / అపూర్వ వ్యాసాలు
ముదిగంటి సుజాత రెడ్డి / Mudiganti Sujatha Reddy · Literature

Price: Rs. 180. సాహిత్యం, సంస్కృతి, చరిత్ర పరస్పరం అనుసంధానమైన అంశాలు. సమాజ గమనాన్ని ప్రభావితం చేసే కారకాలు. సృజనాత్మక చింతనకు మూలాధారాలు. సరికొత్తగా ఆలోచించే దృష్టిని అందించడం వీటిలోని మేలిమి సుగుణం. కనుకనే ముదిగంటి సుజాతారెడ్డి వ్యాసాలు చదవడం పాఠకులకు ఉదాత్త అనుభవం. భిన్నమైన రీతిన ఆలోచించడానికి వారి వ్యాసాలు తోడ్పడతాయి. చరిత్రకీ, సాహిత్యానికీ, వర్తమాన సమాజానికీ నడుమ గల అంతర్గత సంబంధాన్ని వివరి స్తాయి. స్థిరపడిపోయిన చారిత్రకాంశాలని కూడా ప్రశ్నిస్తూ అసలు నిజాల్ని లోకం దృష్టికి తీసుకు రావడం ఆమె వ్యాసాల్లోని ప్రత్యేకత. వేములవాడ చాళుక్యుల గురించి చెప్పినా, మాక్స్ ముల్లర్ గురించి వివరించినా, జగజ్జేతగా కొనియాడబడే అలెగ్జాండర్ గురించి రాసినా సరికొత్త దృక్కోణం కనిపిస్తుంది. గురజాడ, రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి, పొట్లపల్లి రామారావు, వట్టికోట ఆళ్వారుస్వామి, పాకాల యశోదా రెడ్డి, అబ్బూరి ఛాయాదేవిల కృషిని వినూత్న రీతిన అంచనా వేసి, వారి కృషిలోని ఔన్నత్యాన్ని వివరించడం సుజాతారెడ్డి వ్యాసాల ప్రత్యేకత, తెలంగాణ తొలితరం కథలు, తెలంగాణ తొలితరం స్త్రీల సాహిత్యం, ఆధునిక తెలంగాణ కథల పోకడల్ని ఏ రీతిన ఆకళింపు చేసుకోవాలో ఆమె వివరించిన తీరు మన అవగాహనను విస్తృతం చేస్తుంది. సరిగా ఆలోచించడం, భిన్నంగా యోచించడం నేర్పుతుంది.