Anubhavaalu-Gnapakaalunu

Sripada Subrahmanya Sastry / శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి · Biographies & Auto Biographies

Anubhavaalu-Gnapakaalunu book cover

Price: Rs. 450. శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి గారు పండితుడుగా, రచయితగా తన జీవితంలో అనుభవించిన, అనుభవాలూ-జ్ఞాపకాలూనుగల కలశమిది. తెనుగు వాఙ్మయంలో ఈ రకం గ్రంథాలకిదే మొదటిది, స్వీయ చరిత్రలూ, ఆత్మకథలలో ఆణిముత్యమిది. మహామహులైన పండితులు, రచయితలు, మిక్కిలి అపూర్వమైన, అత్యత్భుతమైన వ్యక్తిత్వ వికాస గ్రంథమని కొనియాడిన సుగ్రంథమిది. మొదట వైదిక విద్యలు నేర్చుకొని, 13వ యేటనే కథలు రాయడం ప్రారంభించి, అగత్యమై తెనుగు పాండిత్యం గడించుకోవడంలోనూ, రచన చెయ్యడంలోనూ, శ్రీపాదవారు ఎదుర్కొన్న ప్రతిబంధకాలూ, అనుభవించిన నిర్బంధాలూ, పొందిన ఆవేదన, పట్టిన దీక్ష, చేసిన సాధనా, ఆ సాధనలో వారు కనపరచిన పరాకాష్ఠా, తత్ఫలితంగా వారు పొందిన విజయాలు, గ్రంథ ప్రకటనకు కలిగిన - కలుగుతూనూవున్న ఇబ్బందులూ - ఇవన్నీ పాఠకుల హృదయాలు కరిగించడమే కాదు, రసమహిమలున్నూ చేస్తాయి చదివితే. అనేక చోట్ల-అనేక సందర్భాల్లో అనేక మాట్లు రాత ప్రతిని చదివించుకుని విని, అనేకులు మిక్కిలి ముగ్ధులై వున్నారు.

Browse more Telugu books