Antaranivaadu / అంటరానివాడు
చింతపట్ల సుదర్శన్ / Chintapatla Sudarshan · Novels

Price: Rs. 135. సామాజికంగా అణచివేయబడ్డ అట్టడుగుస్థాయి మనుషుల జీవన చిత్రాలు ముల్క్ రాజ్ ఆనంద్ రచనలు. డిసెంబర్ 12, 1905లో జన్మించిన ముల్క్ రాజ్ ఆనంద్ 11 నవలలు.. 6 కథాసంపుటాలు అందించాడు. 'Coolie', 'Untouchable' ఆయన ప్రసిద్ధ నవలలు. 'Untouchable' నవల 'India's Charles Dickens' అనే పేరు తెచ్చింది . 19535 లో World Peace Council International Peace Prize అందిస్తే భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్ , 1971లో సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించింది. ముల్క్ రాజ్ ఆనంద్ హిందూ మత ఛాందసాన్ని, అగ్రకులాలవారి దుర్మార్గాన్ని, అంటరానివారుగా తిరస్కరింపబడినవారి పేదరికం, ఆకలి బాధ, తీరని శోకం, ఎదుర్కొన్న అవమానాలను చిత్రించిన నవల "Untouchable". 1935లో రాయబడిన ఈ నవల ఆనాటి సమాజాన్ని, దళితుల దుర్భరమైన జీవితాలను ఒక ప్రత్యేకమైనశైలిలో అందిస్తుంది. అంటరానివాడు వర్తమాన భాషలో దళితుడు అయిన ఒక యువకుని ఒకరోజు అనుభవాల్ని ప్రయోగాత్మకంగా చిత్రించింది ఈ నవల. పద్దెనిమిదేళ్ళ యువకుడు బాఖా ఊరికి దూరంగా విసిరివేయబడ్డ మురికివాడలో, కాలువ దుర్గంధంలో, చాలీచాలని మట్టి ఇంట్లో బ్రతుకుతూ కాలువ ఒడ్డున కులీనులు ఉపయోగించే మరుగుదొడ్లను ఉదయం, సాయంత్రం శుభ్రం చేస్తుంటాడు. తండ్రి లాఖా, చెల్లెలు సోహిని వీధులు ఊడ్చేపని చేస్తే, తమ్ముడు రాఖా అన్నలాగే మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటాడు.