Andhala Natudu Haranath

డాక్టర్ కంపల్లె రవిచంద్రన్ / Dr. Kampalle Ravichandran · Biographies & Auto Biographies

Andhala Natudu Haranath book cover

Price: Rs. 235. పాత్ర పోషణ అంటే వచ్చినపాత్రలో దూరి పోవడం కాదు. ఆ పాత్రకి ముందే అందులోకి ప్రవేశించ గలగడం. అది జరగాలంటే వెనకటి పాత్రల్ని గతించినగతంగా విడిచిపెట్టకూడదు. ఇది క్షుణ్ణంగా తెలిసిన నటుడు హరనాథ్. అతను ఒక వేషం వేసినప్పుడు అతని సర్వేంద్రియాల్లోంచి మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా, ఉద్వేగాల సాక్షిగా వ్యక్తమయ్యేలా చూసుకుంటాడు. రచయిత ఊహించిందీ, దర్శకుడు విశదీకరించింది, తనలో ఆవిర్భవించేదీ మూడూ ఒకటే కావడమే పాత్ర పోషణలో అతను ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడనడానికి నిదర్శనం! ఇక హరనాథ్ అసాధారణ సౌందర్యం గురించి నాలుగుమాటలు తప్పక చెప్పుకోవాల్సిందే! "Take him and cut him out in little stars, And he will make the face of heaven so fine That all the world will be in love with night And pay no worship to the garish Sun". రోమియో జూలియెట్ విషాదాంతనాటకంలో రోమియో అసాధారణ సౌందర్యం గురించి చెబుతూ, Act III, Scene Il లో జూలియెట్ ఈ మాటలు అంటుంది. ఈ నాలుగుమాటలూ హరనాథ్ కు కూడా సరిపోతాయి.

Browse more Telugu books