Anataranithanam Athmakatha, Ramabai Ambendkar Jeevitha Charithra, asprushyulu Evaru?

Editor · History

Anataranithanam Athmakatha, Ramabai Ambendkar Jeevitha Charithra, asprushyulu Evaru? book cover

Price: Rs. 180. మనదేశంలో అంటరానితనం ఉనికిలో ఉన్న విషయం విదేశీయులకు తెలుసు. కాని అది ఎంత దుర్మార్గంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసు కోవడానికి వారు మన పొరుగునలేరు. అంటరానితనం ఎంత దుర్భరమో వారు అర్థం చేసుకోలేరు. హిందువులు పెద్ద సంఖ్యలో నివసించే ఊళ్ళకు వెలుపల బతకడం, ప్రతిరోజు ఊర్లోని అశుద్ధాలను మోసుకెళ్ళడం, ఇంటి ద్వారాల ముందు ఉంచిన ఆహారాన్ని తెచ్చుకోవడం, హిందూ వైశ్యుల అంగళ్లకు దూరంగా నిలబడి సరుకులను కొనుక్కోవడం, ఊళ్లోని ప్రతీ ఇంటిని తనదిగా భావించి సేవలు చేసినా ఎవరినీ తాకడానికి వీల్లేదు. అంటరానివారు ఉన్నత కులాల చేత ఎలా వేదన చెందాల్సి వస్తుందో మాటల్లో చెప్పడం కష్టం. సాధారణ స్థితిని వివరించడం లేదా ఆ దుర్మార్గాలకు సంబంధించిన ఘటనలను వారి ముందుంచడం అనే రెండు పద్ధతుల ద్వారా మన లక్ష్యాన్ని సాధించగలం. మొదటి పద్ధతి కంటే రెండవది సమర్ధమైందని భావిస్తాను. ఈ పరిస్థితులను తెలియచెప్పడానికి నా అనుభవాలతో పాటు ఇతరుల అనుభవాలను కొన్ని వివరిస్తాను. నా అనుభవాలతో మొదలెడతాను. - డా|| బి.ఆర్.అంబేడ్కర్ బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ భార్య రమాబాయి జీవన పోరాటాన్ని తెలిపే రచన కొంత ఆలస్యంగా వచ్చిన దళిత మహిళల జీవిత చరిత్ర ల కోవలో ఒక పెద్ద లోటును పూరించింది. - డా|| బి. విజయభారతి బాబా సాహెబ్ డా|| అంబేడ్కర్ జీవితంలోకి అడుగుపెట్టి, దుర్భర దారిద్య్ర్య దినాల్లో వెన్నంటి ఉండి, ఆయన విద్యార్జనకు సహకరిస్తూ కుటుంబ భారాన్ని మౌనంగా భరిస్తూ ఆ మహదాశయానికి అండగా నడిచింది రమాబాయి. మానవ జాతి చరిత్రలో ఇలాంటి మహిళామణుల జీవిత చరిత్రల అధ్యయనానికి ఇదో దిక్సూచి. డా|| అప్పికట్ల భరత్ భూషణ్ ఐఆర్టిసి (రిటైర్డ్) అస్పృశ్యతను గురించి సిగ్గు పడాల్సింది పోయి హిందువులు దాన్ని సమర్థించే ప్రయత్నిస్తారు. వారు సమర్ధన ఎలా ఉంటుందంటే, ఇతర దేశాలు చేసినట్లు హిందువులు బానిసత్వాన్ని ఎప్పుడూ సమర్ధించలేదు. పైగా అస్పృశ్యత బానిసత్వం కంటే నీచమైనదేమీ కాదని వాదన చేశారు. ఇలాంటి వాదనలు తిప్పికొట్టడానికి అంబేడ్కర్ సిద్ధాంతమే సరైన మార్గం

Browse more Telugu books