ANANTHAM
శ్రీ శ్రీ / SRI SRI · Novels

Price: Rs. 270. నిజం చెప్పడం వల్ల లాభం లేదంటే అబద్ధం చెప్పడంవల్ల నష్టం వుందని అర్ధం కాదు. నిజానికి అబద్ధం, లాభానికి నష్టం, చీకటికి వెలుతురూ, చావుకి బ్రతుకూ కేవలం వ్యతిరేకార్థకాలు కావు. ఈ ద్వంద్వాలకి మధ్య అనేకమయిన అర్థభేదాలతో అనేక భావాలుంటాయి. ఉదాహరణ: చీకటి, చీకటి కాని దానికి వ్యతిరేకం. చీకటి కానిది వెలుతురు కాదు. మరేదయినా కావచ్చును. అలా కాదగ్గవి అనేకం. అలాగే వెలుతురు, వెలుతురు కాని దానికి విరుద్ధం. కాని అది చీకటి కాదు. ఆ కానిది ఇంకో అనంత సంఖ్య. ఎటొచ్చీ మొదటి అనంతంలోనే రెండో అనంతం గర్భితమయి ఉంటుంది. అందుకే అన్నాను ఎంత ద్వ్యర్థం సృష్టి! అని. అసలు ఇలా రెండు అనంతాలు లేవు. ఇటు నుంచి బయలుదేరినవీ, అటు నుంచి వస్తున్నవీ ఎక్కడో కలిసిపోతాయి. ఏకం నుంచి బయలుదేరి అనంతం దాకా వెళ్ళడంలోనే అనంతం నుంచి బయలుదేరి ఏకం దాకా రావడం ఉంది. మనం జీవిస్తున్నంతసేపు అనుమానిస్తూనే ఉంటాము ఇది మృత్యువు కాబోలునని. అనుమానమే తప్ప నిశ్చయంగా దేని సంగతీ చెప్పలేమని మాత్రం నిశ్చయంగా చెప్పగలం. అన్నట్టు అదీ అనుమానాస్పదమే. -ప్రజాతంత్ర వారపత్రిక - 20-04-1975 విశాఖపట్టణంలో ఆంధ్రా యూనివర్శిటీ లైబ్రరీ నుంచి ఒకసారి నేను రెండు ఇంగ్లీషు కావ్యసంపుటాలు తీసుకువచ్చాను. వాటిలో ఒకటి రూపర్ట్ బ్రూక్. రెండోది ఎల్ఫ్రెడ్ విల్సన్ గిబ్సన్ది. ఇద్దరూ యువకవులు (ఆ పుస్తకాలలోంచి చింపిన వారిద్దరి రూపచిత్రాలనూ చాలాకాలం నేను దాచుకున్నాను). ఇరవయ్యో శతాబ్దపు కీట్స్ అని పేరొందిన రూపర్ట్ బ్రూక్ అప్పటికే మొదటి ప్రపంచయుద్ధపు తుదిమాసాల్లో రణరంగంలో జొరపడి మరణించాడు. అతనొకచోట ఇలా అన్నాడు. "There are three things worth while in this life. To read poetry, to write poetry, to live poetry" అని! (ఈ జీవితంలో చెయ్యదగ్గవి మూడున్నాయి. కవిత్వాన్ని చదవడం, కవిత్వాన్ని రాయడం, కవిత్వాన్ని జీవించడం!). అప్పటికి నాకు కవిత్వాన్ని చదవడం, రాయడం ఎలాగో తెలుసు. కవిగా జీవించడమెలాగో తెలుసుకోవడానికి చాలాచాలా కవుల రచనలతోబాటు వారివారి జీవితచరిత్రలను కూడా చదివాను. అయినా కవిగా బతకడమెలాగో ఇప్పటికీ న