Amma Kadupu Challaga
Editor · Biographies & Auto Biographies

Price: Rs. 690. తెలుగువారిలో ఇన్ని రంగాలలో కీర్త్మిశిఖరాలు అధిరోహించిన వారు అరుదుగా కనిపిస్తారు... ఆనాటి కాలానికి, విలువలకు దర్శణం కుట్టిన విశ్వనాథ వారి రచనవలె వీరి ఆత్మకథ కూడా ఒక సహస్రఫణి. -సద్గురు కందుకూరి శివానందమూర్తి యాభై సంవత్సరాల డైరీలు! ఇరవై వేల తీపిజ్ఞాపకాల పూతరేకులు: అంతా బెల్లం, నెయ్యి, జీడిపొడి మాత్రమే కాదు. కమ్మని కారం, ఆవతీవ, వగరు, చిగరు... ఆ!! నుంచి 'హా' దాకా ఆహాతే. ఒహో. మలయమారుత తరంగం, గొల్లపూడి అంతరంగం. - ముళ్ళపూడి వెంకటరమణ నిప్పురవ్వలాంటి ఒక దాహార్తితో పరివాక్య వాక్యంలో పల్లరించిన బ్రతుకు రహస్యాల 'భగవద్గీత' "అమ్మకడుపు చల్లగా". - సుద్దాల అశోక్ తేజ గొల్లపూడి మారుతిరావుగారిది ఒక ప్రత్యేక శైలి. వారు విజ్ఞులు. స్నేహపాత్రులు. రసజ్ఞులు... గొల్లపూడి వారి మనస్సు మల్లెపూవు లాంటిది... వారి పుస్తకం వల్ల ఆరోజుల్లో రేడియో జ్ఞాపకాలు. ఇప్పుడు జరిగినట్టే అనుభవిస్తున్నాను. -మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఏడు దశకాల తరువాత జ్ఞాపకం ఉంచుకోవడం (అన్నీ) దాచుకోవడం, పంచుకోవడం అందరికీ సాధ్యం కాదు. సాధ్యమయ్యే కొద్దిమందిలో అతి కొద్దిమందిలో- మారుతిరావుగారు ఒకరు. - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం The deft correlation of events and the underlying social criticism of politics, education system, intolerance and other evils gives a depth and value to the contents which are without exception scintillating. - Ichchapurapu Jagannadharao