Ameena

Editor · Novels

Ameena book cover

Price: Rs. 100. "తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంది. తనను తాను అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంతదూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలం. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చిన వ్యక్తి.” 1894 మే 19న జన్మించిన చలం నవలలు, కథలు, కవితా రచనలు, రూపకాలు, ఏకాంకికలు, అనువాద రచనలు మిక్కిలిగా చేశారు. ఇంకా చరిత్రలు, వ్యాసాలు, లేఖలు, పీఠికలు, వేలకొలది ఉత్తరాలు వెలువరించారు. చలం జీవితం, సాహిత్యం మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు వచ్చాయి. 1979 మే 4న కనుమూశారు. +++ “అమీనా స్వేచ్ఛకు ప్రతీక. ఆడంబరాలలోను, లోకపరత్వంలోను మన అంతరాత్మ స్వేచ్ఛను మనమే మర్చిపోతాం. స్వేచ్ఛకు ముఖ్యంగా కావలసింది. గుర్తింపు. లౌకిక విషయాలు ఆ ప్రవృత్తికి ఆటంకాలు. ఇది అంతరంగిక స్వేచ్ఛ. అంతరంగం వ్యక్తం కాకపోతే అశాంతి. ప్రత్యక్షమయితే నిర్లక్ష్యం. ఈ ద్వంద్వాల చిత్రణమే ఈ నవల. కవితాత్మకంగా సాగే ఈ రచన చలంగారి అన్వేషణకు ప్రతీకగా నిలచి పాఠకుల మనస్సును పరుగులు తీయిస్తుంది.”

Browse more Telugu books