Alvida
Editor · Novels

Price: Rs. 95. కౌముది కవిత్వం వెతికిపట్టి ఇవాళ ఒకచోట పెట్టి చూపిస్తున్న మిత్రుల కృషి విలువైనది. ఆ కవిత్వమంతా వరసగా ఇవాళ చదువుతూంటే - పాతగా పొగలాగ, అనిపించదు. ఆ వాక్యాలకు, పదసంపుటికి, పాతదనం లేదు. పునరుక్తి కాదు. కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది. మరీ ముఖ్యంగా 'ఏకాంత', 'ఒక వృక్షం', 'ఇంతకూ నేనెవర్ని' అనే వచన పద్యాలూ, 'కవినైతిని', 'వసంతగీతి', 'మిణుగురులు', 'విశ్వశాంతి', - గేయాలూ; 'దీపావళి', 'వికృత ప్రాకారాలు' పద్యాలూ, 'ఒక అనుభవం' రచన వంటివి. కౌముదిగారి కవిత్వాన్ని పాతబడనివ్వవు. 'మమ'రీ మరీ 'ముఖాముఖం' అంతా, చదవదగిన కవి హృదయం. నిజానికి, అలా మాట్లాడగలిగిన కౌముది గారికి ఎవరి యెగ్యతాపత్రాలూ, భుజం తట్టుళ్లూ అక్కరలేదు. తన కాలంలో, మిగతా కవులకంటే వేరుగా మాట్లాడ గలిగితే - ఒక కవి తన గొంతుతో మాట్లాడుతున్నాడని అర్థం. కౌముదిగారు అభ్యుదయ కవుల్లో సొంతగొంతున్న కవి.