ALLARI LEKHA
Editor · Children's Books

Price: Rs. 60. 'అల్లరి లేఖ' అనే పేరుతో, శ్రీమతి నాగరత్న ఈ ముచ్చట్లు రాశారు. ఇవి ముచ్చట్లే. వ్యాసాలు, కథలూ కావు. అన్నీ పావుపేజీ, అరపేజీ. వాళ్లమ్మకి చెప్పిన సలహాలు, సూచనలూ అమాయకంగా చెప్పినట్టు అనిపించవు. కొన్ని నిజంగా నిజం అనిపిస్తాయి. చిన్నచిన్న మాటలు చెప్పినా, వాటిలో నిజం వుంటుందిగాని, అబద్ధపురేఖ ఏమాత్రం కనిపించదు. కల్మషం వుండదు. అసలు కల్మషం అనేది తెలిస్తే కదా, వుండడానికి! పిల్లల మనస్తత్వాల్ని బట్టి పెద్దవాళ్లు నడచుకోవాలి; పెద్దలు చెప్పినట్టు పిల్లలు నడచుకోవాలి. ఇది ఏనాటినుంచో వస్తున్న సూక్తి.