Akshara Ratham
Namilakonda Nageshwar Rao / నమిలకొండ నాగేశ్వర్ రావు · Stories & Poetry

Price: Rs. 180. అక్షరం లోతు తెలిసినవాళ్లు అక్షరాలు సృజిస్తారు. అక్షరాల్లో మునిగి అక్షరాల్లో తేలి ఆదర్శవంతమైన కలలు వెదజల్లుతారు. ఆశయాలు పండిస్తారు. ఆర్ద్ర హృదయాల్ని రసోచిత బంధాలతో అలరిస్తారు. అక్షరాల మీద అవ్యాజమైన ప్రేమతో, తపనతో "అక్షర రథం" నడుపుతున్న కవి నమిలకొండ నాగేశ్వర్రావు. నాగేశ్వర్రావు హృదయం ఆర్థమైంది. భావుకత అతని ఆరోప్రాణం. మనిషికి, హృదయానికి ప్రమాణాలుగా మాటలు ఉల్లేఖించాడు. పండుగలన్నా, మహనీయులన్నా, కవులన్నా అమిత ప్రేమ. కవిత్వమై ప్రవహించాడు. యుద్ధాలన్నా, దుర్ఘటలన్నా, ఉన్మాదాలన్నా తీవ్ర వ్యతిరేకత. కవిత్వమై ప్రకోపించాడు. ప్రేమైనా, కోపమైనా ప్రకటించేవాడే కవి. దాచుకునేవాడు కవి కాదు. - డా. నందిని సిధారెడ్డి అక్షరరథానికి సూటాఐదు కవితా చక్రాలు ఉన్నాయి. ఎంతో వైవిధ్యంతో కూడిన రంగురంగుల చక్రాలు కొత్త కొత్త శీర్షికలతో సరికొత్త రూపాలను సంతరించుకొని తెలంగాణ భూమంతా తిరుగాడినవి. నూటొక్క ఆలోచనలకు కోటొక్క సమస్యలు అన్నట్టు- ఎన్నో సమస్యల మీద, ఎన్నో సంఘటనల మీద స్వేచ్చగా తను ఇష్టానుసారంగా రాసిన కవితలు కోకొల్లలు. తన లోపల కలిగిన స్పందనల వల్ల ఇందులోని ఎన్నో కవితలు సమాజాన్ని ప్రతిబింబింప చేసేవిగా ఉన్నాయి. మమతలు మానవత్వాలు పూర్తిగా నశించిపోయాయని అవి చావకుండా ప్రేమాభిమానాలు పెళ్లుబుకాలని చెబుతూ తన కవితలన్నిట్లోనూ సందేశాత్మకమైన సమాచారాన్ని మనముందుంచాడు. - కందుకూరి శ్రీరాములు జీవితమంతా కష్టాలతో పేదరికంలో గడిపి నిత్యం ఆలోచించడం సమాజంలో ఉన్న పేదరికం కారణంగా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ అనుభవంతో ఆ కష్ట నష్టాలను కవిత్వంలో పెట్టాలనే ప్రయత్నం మొదటి నుండి చేస్తూనే ఉన్నారు. ఆయన కవితా వస్తువు సమాజంలో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులే. అక్షర రథంతో ఆగకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ... - దేవి ప్రసాద్ నాగేశ్వర్రావు గారు రాసిన ఈ సంపుటిలో సింహభాగం సమకాలీన సమస్యలపై స్పందిస్తూ విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ, అక్కడక్కడ పరిష్కార మార్గాలు సూచిస్తూ రాసిన కవితలు ఉన్నాయి. నమిలకొండ నాగేశ్వర్రావు గారు తను చెప్పదలుచుకున్న విషయాన్ని స