AKSHARA KAANTULU

జంధ్యాల రఘుబాబు / Jandhyala Raghubabu · Literature

AKSHARA KAANTULU book cover

Price: Rs. 135. తను పుట్టి, అక్షరాభ్యాసం చేసిన రోజునుంచి నేను చూస్తున్న రఘుబాబు పదవీ విరమణ సమయంలో అక్షరానుశీలనలతో అందరినీ అలరించడం అభినందనీయం. ఆనందదాయకం. అటు అక్షరాలతోనూ ఇటు ఆచరణలోనూ నిరంతరం స్పందించే నిబద్ధ జీవితం తనది. ఉద్యోగిగా, ఉద్యమజీవిగా, హాస్యభాష్యకారుడుగా, కాలమిస్టుగా, కళాసంగీత ప్రియుడుగా అందరి అభిమానం చూరగొన్న సకలజన సన్మిత్రుడు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శిగా ఇంచుమించు గత ఇరవయేళ్లుగా ఒక ముఖ్యపాత్ర నిర్వహిస్తున్న వ్యక్తి. ఈ సమయంలోనూ తన రచన విడుదల చేయడం గాక తను ఇష్టపడే గౌరవించే వారి రచనల మాలికను అందించడం కూడా ఆ స్నేహశీలతకు సంకేతమే. రఘుబాబు కృషి మరింత సార్ధకం కావాలనీ, మరిన్ని సత్ఫలితాలు ఇవ్వాలనీ ఆశిస్తున్నాను. సాహితీ స్రవంతి పక్షాన అభినందిస్తున్నాను. - తెలకపల్లి రవి సమీక్షలపై సమీక్ష రాయటం కష్టం. రఘుబాబు వివిధ రకాల సాహిత్యాన్ని పాఠకుల హృదయాలను హత్తుకొనే విధంగా, సరళంగా, హృద్యంగా పరిచయం చేశారు. సన్నిహితులు కాబట్టి పొగడ్తతో ముంచి లేపారని అనను. దోషాలు, లోపాలు గమనించిన సందర్భాలలో సున్నిత చురక, మందలింపు, సూచన, హెచ్చరికలు కూడా చేశారు. సమీక్షల్లో నిష్పక్షపాతం, ఆప్యాయత, అభ్యుదయ భావాలను చూస్తాం. తన చుట్టూ ఉన్న సమాజం, దాని చైతన్యం గురించి కవులు, రచయితలు రాసే లేదా సృజించే సాహిత్యం ఏమేరకు ఉపయోగకరంగా ఉంటుందో తన అక్షరాంతరంగం ద్వారా తెలియజేశారు. - పగిడిపల్లి వెంకటేశ్వర్లు తమిళ, మలయాళ కవులు తమ పుస్తకం గూర్చి పొగడటంకంటే నాల్గు విమర్శనాత్మక సూచనలు చేస్తారని ఆశతో ఎదురు చూస్తారు. ఇలాంటి వైఖరి తెలుగు కవులలోనూ, వారు సృష్టించే సాహిత్యంలోనూ వృద్ధి చెందాలి. ఈ పుస్తకంలో కవిత్వం, కథ, నవల లకు సంబంధించి లోతైన, పదునైన విమర్శ చేయడంలో సఫలమయ్యారు రచయిత. అనేక నిర్మాణ సూత్రాలేకాక, సైద్ధాంతిక చర్చనూ చేసే ప్రయత్నం చేశారు. ఒకరకంగా సాహిత్యానికి శస్త్రచికిత్సలాంటి గ్రంధం. కవిత్వాన్ని కవిత్వంగా చూడమని, జీవితంలాగే కవిత్వం మారుతుందనే తాత్విక విమర్శను రచయిత తెరమీదకు తెస్తారు. దీన్ని పదునైన విమర్శగానే భావించాలి. కవులు మరిం

Browse more Telugu books