Aakhari Yodhulu

Editor · Best Collection

Aakhari Yodhulu book cover

Price: Rs. 220. ఇది అద్భుతమైన పుస్తకం, స్వతంత్ర పోరాట పదాతి సైనికుల గాథలను ఒక్క దగ్గరికి చేర్చారు. ఇది జీవిత చరిత్రల రచనలకు, చారిత్రక కథనాలకు కొత్తదారులు చూపిస్తుంది. - గోపాల్ గాంధీ వలసవాదాన్ని జయించడంలో సాధారణ ప్రజల పాత్రను గుర్తుంచుకోవాలి. వారి త్యాగాలను శ్లాఘించాలి. ఆ పనిచే ఈ పుస్తకం ఎంతో సమర్థవంతంగా చేసింది. సాయినాథ్ వారి గాథలను ఎంతో సున్నితంగా అర్థం చేసుకొని అంతే సున్నితంగా వ్యక్తీకరించారు. - రోమిల్లా థాపర్ స్వతంత్ర పోరాటంలో నిజంగా ముందుపీఠిన నిలిచిందెవరు? లక్షలాది సాధారణ జనం- రైతులు, కార్మికులు, ఇల్లాళ్ళు, అటవీసంపదపై ఆధారపడి జీవించేవారు, చేతివృత్తుల వారు, ఇంకా ఇలాంటి వారే అంతా. వారెవరూ మంత్రులు కావాలనో, గవర్నర్లు కావాలనో, రాష్ట్రపతులు కావాలనో, ఇంకా అలాంటి పెద్ద పెద్ద పదవులు కావాలనో కోరుకోలేదు. కాని వారందరిలో ఒకటే సాధారణ లక్షణం ఉంది. అది బ్రిటిష్ పాలనను అతి దృఢంగా ఎదురొడ్డి నిలబడటమే. ఈ 'ఆఖరి యోధులు' పుస్తకంలో స్వతంత్ర పోరాట పదాతి సైనికులు తమ గాథలను మనకు వివరిస్తారు. ఈ పుస్తకంలో చోటుచేసుకున్న స్త్రీలు, పురుషులు, పిల్లలు ఆదివాసీలు, దళితులు, ఓబిసిలు, బ్రాహ్మణులు, ముస్లిములు, సిక్కులు, హిందువులు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. రకరకాల భాషలు మాట్లాడతారు. వారిలో నాస్తికులున్నారు, వామపక్ష వాదులున్నారు. గాంధేయ వాచులున్నారు. అంబేద్కర్ వాదులున్నారు. వీరంతా ఒక చిక్కు ప్రశ్నను సంధిస్తారు. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి. వారంతా స్వతంత్రం తర్వాత ఏమిటి అన్నదాని గురించి ఆలోచించారు. దాదాపు అందరూ 1947 తర్వాత కూడ సుదీర్ఘ కాలం పాటు తమ పోరాటాన్ని కొనసాగించారు. 1947 అనంతర తరాలకు ఈ గాథలు చాల అవసరం. వారు స్వతంత్రం గురించి ఏమి ఆలోచించారో తెలుసుకోవాలి. స్వతంత్రం. స్వేచ్ఛ ఒకటి కాదు. అలాంటి స్వేచ్ఛ కోసం నేటి తరాలు పోరాడాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం ముందుకు తెస్తుంది.

Browse more Telugu books