Akhari Poratam
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 108. మగవాడు పొరపాటున చెయ్యి తాకితే ముందు ఇటుకపొడితో, తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిను, నికుంజ్ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రి నుంచీ ఒక అమ్మాయి అతడితో ఫోన్లో రొమాన్స్ చేయటం మొదలు పెడుతుంది. పైకి తులసి మొక్క టైపు అమ్మాయిలాగా కనపడే సునాదమాలే ఈ విధంగా ఫోన్ చేసి తనని ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు. ఫోన్ చేస్తున్నదేవరు ? ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితులలో ఒక సి.బి.ఐ. ఆఫీసర్ని కలుసుకుంటాడు. ఆ ఆఫీసర్ ఎవరు ?? సరదా సరదాగా సాగిపోతూ అనుకోకుండా అన్యూహ్యమైన సస్పెన్స్‌తో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే నవల 'ఆఖరి పోరాటం'