Akbar - Birbal Kathalu

P. Rajeshwar Rao / పి. రాజేశ్వర్ రావు · Stories & Poetry

Akbar - Birbal Kathalu book cover

Price: Rs. 230. అక్బర్ మూడవ మొగలాయి చక్రవర్తి. ఆయన ఆస్థానంలో ఎంతోమంది ప్రతిభావంతులు వుండేవారు. వాళ్లల్లో రాజా బీర్బల్ ఒకరు.. ఆయనంటే చక్రవర్తికి యెంతో యిష్టం వుండేది. బీర్బల్ బుద్ధి కుశలత పాదరసంలాంటిది కావడం యిందుకు కారణం. రాజా బీర్బల్ కవిత్వం రాసేవాడు. అక్బర్ ఆయన్ని తన ఆస్థానకవిగా నియమించుకున్నాడు. బీర్బల్ని తన సన్నిధిలోనే వుంచుకోవడం చక్రవర్తికి యిష్టం: బీర్బల్ వాక్చాతుర్యం, వివేకవంతమైన మాటలు అందుకు కారణం. అక్బర్ చక్రవర్తి భారతదేశాన్ని పాలించి నాలుగువందల యేండ్లు దాటింది. బీర్బల్ కవితలు, చతురోక్తులు, సమయస్ఫూర్తి, ఆయన్ని అలరించి ఆనందింపజేసీ అంతేకాలం అయింది. అయితే బీర్బల్ గురించి యింతకాలంగానూ ఎన్నో కథలు ప్రచారంలో వున్నాయి. వాటిలో కొన్ని నిజం కావచ్చు, కొన్ని కాకపోవచ్చు,. అవన్నీ జానపదుల గాథలు. ఒక తరం నుంచి యింకో తరానికి జనం అందిస్తూ వచ్చిన గాథలు, మళ్లీ మళ్లీ వాటిని చెప్పుకుంటూనే వున్నారు. కథ చెప్పేవాళ్లు ఆ కథలకి తమవంతుగా యెంతోకొంత జోడించేవారు. అలా ఆ కథల్ని మార్పుచేసేవారు. అయినా వాటికి ఆదరణ తగ్గలేదు. ఏమంటే చదువుకోడానికి మురిపెంగా వుంటాయి, నవ్విస్తాయి. మన జీవితాల్లో ఏది వాస్తవమో, ఏది మంచిదో ఆ కథలు కొన్నిసార్లు ఆలోచింపజేస్తాయి.

Browse more Telugu books