Agnipravesam
యండమూరి వీరేంద్రనాథ్ / Yandamuri Veerendranath · Novels

Price: Rs. 117. ఆస్పత్రి లేబర్ రూం డ్యూటీ చేస్తున్న ఆదిలక్ష్మి అనే నర్సుకి తను చూసిన సినిమాలోలా అపుడే పుట్టిన ఇద్దరు పిల్లల్ని అటు ఇటు సరదా (?) గా మార్చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఇరవై సంవత్సరాల తరువాత ఆ రహస్యం తనకొడుక్కి చెప్పి ఆమె మరణించే సమయానికి, తమతమ జీవితాల్లో ఆ ఇద్దరాడపిల్లలూ రెండు రకాలుగా అగ్ని ప్రవేశం చేయటానికి సిద్ధంగా వున్నారు. తరువాత ...? భిన్నమైన కథతో, విభిన్నమైన పాత్రలతో, స్త్రీసమస్య గురించి ఇంతకు ముందు ఏ రచయిత్రీ వ్రాయనంత సూటిగా, తనదైన శైలిలో, సస్పెన్స్ టెన్షన్ మేళవించి, యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ప్రయోజనాత్మక నవల..