Adunika vyavahaara kosam
Editor · Best Selling

Price: Rs. 340. బూదరాజు రాధాకృష్ణ ప్రకాశం జిల్లా వేటపాలెంలో 1932 మే 3న జన్మించారు. తల్లిదండ్రులు సువర్చలా నరసింహారావులు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు, విశాఖపట్నం నుంచి 1953లో బి.ఏ. (ఆనర్సు), 1954లో ఎం.ఎ. డిగ్రీలు 1965లో డాక్టరేటు పొందారు. వి.ఆర్. & వై.ఆర్.ఎన్. కళాశాల, చీరాలలో తెలుగు అధ్యాపకులుగా (1953-68) పనిచేశారు. తెలుగు అకాడమీ హైదరాబాదులో రిసర్చ్ ఆఫీసర్గా (1968-73), డిప్యూటీ డైరెక్టర్ గా (1973-88) ఉన్నారు. హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం విజిటింగ్ ప్రొఫెసర్ (1988-90), ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం ప్రిన్సిపాలుగా (1990-99) పనిచేశారు. 2006 జూన్ 4న చనిపోయారు. స్వీయరచనలు : అశ్రుధారలు (పద్యరచన) (1950), వ్యావహారిక భాషావికాసం (1972, '81, 192, '99), ఈనాడు భాషాస్వరూపం (1981), భాష-శైలి నియమావళి (1985), సాహితీవ్యాసాలు (1950, '95), భాషాశాస్త్ర వ్యాసాలు (1990, 195), జర్నలిజం: అవగాహన - ఆచరణ (1995), జర్నలిజం పరిచయం (1996, 2000), పురాతన నామకోశం (1996, 2003, '06), మాటల మూటలు (1998), తెలుగు జాతీయాలు (1999, 2001), మాటల వాడుక వాడుక మాటలు, అనుభవాలు- న్యాయాలు (1999, 2001), మంచి జర్నలిస్టు కావాలంటే (2000), మాటలూ, మార్పులూ (2001), తెలుగు భాషా స్వరూపం (పదబంధ కోశంతో) (2001), విన్నంత కన్నంత (2001), అనువాద పాఠాలు (2003), తెలుగు సంగతులు (2003), కొమఱ్ఱాజు వేంకటలక్ష్మణరావు (2004), పుణ్యభూమి (2004), తెలుగులో నమస్యాపూరణలు (కూర్పు) (2005), పద్య సాహిత్యం: సంఘచరిత్ర 1900-1950 (2005), ఈనాడు వ్యవహారకోశం (1990), ఆధునిక వ్యవహారకోశం (2000. 2008. 2015), మహాకవి శ్రీ శ్రీ (1999), పరవస్తు చిన్నయసూరి (2002), శానన శబ్దకోశము (?), A Monograph on Chinnaya Suri (1995), A Monograph on Mahakavi SriSri (1996), Occasional papers in language and literature (1998).